Samantha : తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మరీ ఇంత దారుణం ఏంట్రా బాబు
Samantha : టైటిల్ చూసి అపార్థం చేసుకోకండి.. ఇలా అనక తప్పడం లేదు. ఎందుకంటే దేశ భక్తి పాటలు.. దేవుడి భక్తి పాటలు.. మంచి ఫీల్ ఉన్న పాటలు విడుదల అయినప్పుడు జనాలు పెద్దగా చూడటం లేదు కాని ఐటెం సాంగ్స్ విడుదల అయితే మాత్రం ఆహా ఓహో అన్నట్లుగా చూస్తున్నారు. ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమా లోని ఊ అంటావా మావ పాట మామూలుగా దూసుకు వెళ్లడం లేదు. పాట విడుదల అయ్యి మూడు వారాలు కూడా కాకుండానే ఏకంగా 105 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇవి అఫిషియల్ వ్యూస్ మాత్రమే.. కవర్ వీడియో.. ఇతర యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చే వీడియోలు అన్ని కలిపి దాదాపుగా 150 మిలియన్స్ కు పైగా ఉంటాయని ఒక విశ్లేషణ చెబుతుంది.
సుకుమార్.. దేవి శ్రీ ప్రసాద్ ల ఐటెం సాంగ్స్ అంటేనే జనాల్లో మంచి ఆధరణ ఉంటుంది. మాస్ కు ఊర మాస్ కిక్ ఇచ్చే పాటలను వారు ఇద్దరు ఇప్పటి వరకు తీసుకు వచ్చారు.. కనుక ఈ పాట కూడా అదే రేంజ్ ఉంటుంది అనుకుంటే అంతకు మించి అన్నట్లుగా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కు మంగ్లీ సోదరి అయిన ఇంద్రవతి చౌహాన్ గాత్రం మరింత స్పైసీనెస్ ను యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం పాట ఒక ఎత్తు అయితే సమంత హాట్ అందాలతో బో గా ఈ పాటలో కనిపించడం మరో ఎత్తు. దాంతో పాట సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. సమంత బ్రేకప్ తర్వాత ఐటెం సాంగ్ చేయడంతో పాటు ఇది ఊర మాస్ లెక్క ఉండటం వల్ల అనూహ్యంగా స్పందన దక్కింది. ఈ పాట టైటిల్ లోనే మసాలా ఉంది. కనుక మాస్ పీపుల్ కు ఈ పాట విపరీతంగా ఎక్కేసింది.
Samantha : తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మరీ ఇంత బ్యాడ్
ఒక విధంగా ఆలోచిస్తే తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మరీ ఇంత బ్యాడ్ ఏంట్రా బాబు అనిపిస్తుంది. కాని మరో విధంగా ఆలోచిస్తే తెలుగు వారికి నచ్చితే ఇలాగే ఉంటుంది అనిపిస్తుంది. అయినా మూడు వారాల్లో 150 మిలియన్ ల వ్యూస్ ఏంట్రా బాబు.. అఫిషియల్ యూట్యూబ్ ఛానెల్ లో వ్యూస్ మరో రెండు వారాల్లోనే 150 మిలియన్ లకు చేరినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఊ ఊ ఊ ఇదే పాట. పుష్ప సినిమా సూపర్ హిట్ అవ్వడం లో ఈ పాట కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. కేవలం తెలుగు వారు మాత్రమే కాకుండా ఈ పాట ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది. అక్కడి ప్రేక్షకులు కూడా ఊ… ఊఊ అంటున్నారు. మన ప్రేక్షకుల అభిరుచిన ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావాడం లేదు అంటూ విశ్లేషకులు జుట్టు పీక్కుంటున్నారు.