Sreeleela : స్టేజి మీదే బాలయ్య కాళ్లు పట్టుకున్న శ్రీలీల..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreeleela : స్టేజి మీదే బాలయ్య కాళ్లు పట్టుకున్న శ్రీలీల..!

 Authored By aruna | The Telugu News | Updated on :16 October 2023,8:00 pm

Sreeleela : నటసింహం బాలయ్య తాజాగా నటించిన సినిమా ‘ భగవంత్ కేసరి ‘. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ క్రమంలోనే బాలయ్య శ్రీ లీలను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో శ్రీ లీల తనని చిచ్చా చిచ్చా అంటూ పిలుస్తూ నన్ను టార్చర్ పెట్టింది అని సరదాగా అన్నారు. అలాగే శ్రీలీల గొప్ప నటి. మన తెలుగు అమ్మాయి అవడం చాలా గొప్ప విషయం. శ్రీ లీలకు నాకు మధ్య ఎమోషనల్ సీన్లు చాలా ఉంటాయి. వాటిని చూస్తే కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు.

ఆడ మగ తేడా లేకుండా అందరూ ఏడ్చేస్తారు. అంతలా మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయింది. ఆమె కూడా చాలా గొప్పగా నటించింది అని అన్నారు. దీంతో శ్రీ లీల బాలయ్య కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంది. దీంతో వెంటనే బాలయ్య గాడ్ బ్లెస్ యు అని దీవించారు. ఇక శ్రీలీలను నా తదుపరి సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలనుకున్నాను. అదే విషయాన్ని మా ఇంట్లో చెప్తే మా అబ్బాయి మోక్షజ్ఞ కోపడ్డాడు. నేను హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాను. యంగ్ హీరోని నువ్వేమో ఆమెకు ఆఫర్ ఇస్తా అని అంటున్నావ్ అని కోప్పడ్డారు అని గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని మోక్షజ్ఞ అన్న మాటలను మళ్లీ బాలయ్య మరోసారి గుర్తు చేసుకున్నారు.

Sreeleela About on Balakrishna

Sreeleela About on Balakrishna

శ్రీ లీల గొప్ప నటి అని ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య శ్రీలీల కి సంబంధించిన ఉయ్యాల ఉయ్యాల అనే పాట విడుదలైంది. ఈ పాటకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో ఆయన తనదైన స్టైల్ లో హాస్యం చూపిస్తారు. మరి ఈ సినిమాలో కూడా అలాంటిది ఉంటుందా లేక పూర్తిగా ఎమోషనల్ సినిమానా అనేది విడుదల అయ్యాక తెలుస్తుంది. ఇక శ్రీ లీల వరుసగా హిట్లతో దూసుకెళుతోంది. రవితేజ తో ధమాకా సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. ఆ తర్వాత రామ్ తో స్కంద సినిమా చేసి మరో సూపర్ హిట్ అందుకుంది. ఈసారి బాలయ్య బాబుతో మరో హ్యాట్రిక్ హిట్టును కొడుతుందో లేదో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది