Tamil Rockers : తమిళ రాకర్స్ అడ్మిన్ అరెస్ట్.. సినిమాలని ఎలా రికార్డ్ చేస్తారో చెప్పి కంగుతినిపించాడుగా..!
ప్రధానాంశాలు:
Tamil Rockers : తమిళ రాకర్స్ అడ్మిన్ అరెస్ట్.. సినిమాలని ఎలా రికార్డ్ చేస్తారో చెప్పి కంగుతినిపించాడుగా..!
Tamil Rockers : సినిమా ఇండస్ట్రీని పైరసీ పెనుభూతం ఎంతలా వేధిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద హీరో సినిమాలైన ఇట్టే పైరసీ అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్నసినిమాల వరకు ఈ పైరసీ భూతం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తాజాగా ధనుష్ నటించిన రాయన్ సినిమాకు కూడా పైరసీ బెడద తాకగా రాయన్‌ను పైరసీ చేస్తున్న తమిళ్ రాకర్స్ సభ్యుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.ధనుష్ రాయన్ సినిమా పైరసీ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్న సమయంలో చిత్రబృందం సైబర్ పోలీసులకు కంప్లయిట్ ఇవ్వగా.. సైబర్ పోలీసులు దీని వెనుక తమిళ రాకర్స్ మాఫియా ఉన్నట్లు గుర్తించారు.
Tamil Rockers పెద్ద స్కేచ్చే..
అయితే తమిళనాడులో కాకుండా కేరళలో ఈ పైరసీని చేస్తున్నట్లు సమాచారం రావడంతో థియేటర్‌కు వెళ్లగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తమిళ్ రాకర్స్ సైట్ అడ్మిన్ జెబ్ స్టీఫెన్‌రాజ్ తన ఫోన్‌లో రాయన్ చిత్రాన్ని రికార్డ్ చేస్తుండగా కేరళ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం తమిళనాడు పోలీసులకు అప్పగించారు.జెబ్ స్టీఫెన్ రాజ్ తమిళనాడులోని మదురైకి చెందినవారని మరియు అతను చాలా కాలంగా తమిళ్ రాకర్స్‌లో వివిధ చిత్రాల థియేటర్-ప్రింట్‌లను అప్‌లోడ్ చేస్తున్నాడని తెలిసింది. స్టీఫెన్ మొత్తం రాయన్ చిత్రాన్ని థియేటర్‌లో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం ఆ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తుండగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ క్రమంలో పైరసీ చేసే విధానం గురించి కొన్ని షాకిం గ్ విషయాలు వివరించాడు.
సినిమా విడుదల రోజే ఆరు నుంచి ఏడు వెనక వైపు సీట్లను బుక్ చేస్తారని, మొబైల్ ఫోన్ బ్రైట్‌నెస్ తగ్గించి సీటుపై కప్ హోల్డర్‌పై మొబైల్ ఫోన్ పెట్టుకుని థియేటర్ వెనుక సీట్లో కూర్చుని సినిమాని కాపీ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అతడి మొబైల్ ఫోన్ లొకేషన్ తమిళనాడులో ఉన్నట్లు స్పష్టమైంది. అతడిని నిరంతరం పర్యవేక్షిస్తుండగా.. `రాయన్`ని చూసేందుకు వచ్చినట్లు సమాచారం. వంజియూర్ పోలీసుల సహాయంతో నిందితుడిని అరెస్టు చేసినట్లు కాకనాడ్ సైబర్ సెల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎ జయకుమార్ తెలిపారు.అతడు తమిళ్ రాకర్స్ – తమిళ్ బ్లాస్టర్స్ వంటి సైట్‌లకు కొత్త చిత్రాలను రికార్డ్ చేసి పంపేవాడు. త్రివేండ్రంలోని ఆరిస్ మల్టీప్లెక్స్ సముదాయంలో ఓ స్క్రీన్ లో పైరేట్ లు కాపీ చేస్తూ పట్టుబడ్డారు. వీరంతా మొబైల్ లోని 4కె వీడియో రికార్డింగ్ ఆప్షన్ ని ఉపయోగించి సినిమాని కాపీ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. జెబ్ స్టీఫెన్ రాజ్ తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌లతో పాటు టెలిగ్రామ్ యాప్‌లో కూడా సినిమాలను అప్‌లోడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రాయన్ కాకుండా కల్కి 2898, మహారాజు సినిమా కాపీలు పోలీసులకు దొరికాయి