Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కే షాక్ ఇచ్చిన వరుణ్ తేజ్.. బాబాయ్ డేట్‌ని ఆక్రమించేశాడుగా..!
Pawan Kalyan : కరోనా వలన మెగా హీరోల మధ్య వార్ నడుస్తుంది. మెగా ఫ్యామిలీ హీరోలు వరుస సినిమాలతో సిద్ధంగా ఉండగా, ఒకరితో ఒకరు పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 25న పవన్ భీమ్లా నాయక్ విడుదల కావల్సి ఉండగా, ఇప్పుడు అదే ప్లేస్‌లో వరుణ్ తేజ్ గని వచ్చి చేరింది. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ‘గని’ సినిమా కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది.
ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది.ఇటీవల రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించింది చిత్ర యూనిట్. ఫిబ్రవరి 25 లేదా మార్చ్ 4న ఈ సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు చిత్ర యూనిట్. అయితే తాజాగా ‘గని’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 25నే ఈ సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. అంటే ఆ సమయానికి భీమ్లా నాయక్ చిత్రం రావడం లేదని అర్ధమైంది. ఏప్రిల్ 1న మూవీని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.గని చిత్రం వరుణ్ తేజ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది.
Pawan Kalyan : దెబ్బకు తప్పుకున్నాడు..
ఈ సినిమా కోసం బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ప్రొఫెషనల్ బాక్సర్స్‌తో కలిసి సినిమాలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా,‘బీమ్లా నాయక్’ వాయిదా పడడం వల్లే ‘గని’ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఇది పవన్ అభిమానులకు మరింత నిరాశ కలిగిస్తుంది.