Pawan Kalyan : 12 ఏళ్ల క్రితం తీసుకున్న అడ్వాన్స్ కి ఇప్పుడు న్యాయం చేస్తున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం అటు అభిమానులకు మరియు పార్టీ నాయకులకు ఒకింత అసహనం ను కలిగిస్తుంది అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పూర్తిగా సినిమాలు చేస్తే అభిమానులు సంతోషిస్తారు, లేదంటే పూర్తి రాజకీయాల్లో కొనసాగితే పార్టీకి న్యాయం చేసినట్లు అవుతుంది. కానీ అటు ఇటు కాకుండా పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొంత మంది విమర్శలు చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ తీరుని సమర్థిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు సినిమాలు చేయాల్సి వస్తుంది అనేది ఇప్పుడు కొందరిలో ఉన్న చర్చ. ఇష్టం లేకున్నా సినిమాలు చేస్తున్నాను.. నటిస్తున్నాను అంటూ గతంలో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
ఆయన కేవలం ఆర్థిక అవసరాల నిమిత్తమే సినిమాలను చేస్తున్నానని గతంలోని ప్రకటించాడు. తాజాగా క్రిష్ (Krish ) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఆ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో పెద్దగా క్రేజ్ లేని ఏఎం రత్నం కి ఎందుకు పవన్ కళ్యాణ్ డేట్ ఇచ్చాడు అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు, అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కి నిర్మాత ఏఎం రత్నం ఇప్పుడు, అప్పుడు కాదు అడ్వాన్సు ఇచ్చి ఏకంగా 12 సంవత్సరాల అయిందట. అప్పట్లో అడ్వాన్స్ తీసుకున్న పవన్ కళ్యాణ్ దానికి కొంత మొత్తం వడ్డీ చెల్లించి తిరిగి ఇవ్వచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గుణం అలాంటిది కాదు. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్న పవన్ కళ్యాణ్ తీసుకున్న అడ్వాన్స్ కు న్యాయం చేకూర్చే విధంగా ఇప్పుడు సినిమాను చేస్తున్నాడు.

why pawan kalyan doing a film for tamil producer am ratnam
ఇలా ఎంతో మంది వద్ద పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ తీసుకున్నాడు.కొందరి వద్ద ఇష్టపూర్తిగా అడ్వాన్స్ తీసుకుంటే.. కొందరి వద్ద నుండి బలవంతంగా తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఆ నిర్మాతలు మీరు మాతో సినిమా చేసినా చేయకున్నా పర్వాలేదు, మీకు అవకాశం ఉన్నప్పుడే మాకు కొన్ని డేట్లు ఇవ్వండి అంటూ పవన్ కళ్యాణ్ ని బలవంత పెట్టి చేతిలో అడ్వాన్స్ పెట్టిన వారు కొంత మంది ఉన్నారు. అలా పవన్ కళ్యాణ్ అడ్వాన్సులు తీసుకున్న నిర్మాతలు ఒక పది మంది ఉంటారు అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు న్యాయం చేస్తాడు అంటూ ఎదురు చూస్తున్నారు కొందరు జనాలు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభించబోతున్నాడు. కనుక హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి అయితే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో కనిపించే అవకాశం తక్కువ, మరి ఆ అడ్వాన్స్ లు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటో…!