పవన్ కు మద్దతుగా సినీ నిర్మాత మీడియా ఛానల్.. 2024 టార్గెట్..?
నేడు రాజకీయ పార్టీలు తమ మనుగడను సాగించాలంటే ఖచ్చితంగా మీడియా మద్దతు అనేది అవసరం. దీనితో అన్ని పార్టీలు తమ తమ సొంత మీడియాను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ కి సాక్షి, తెరాస కు నమస్తే తెలంగాణ అధికారంగా ఉంటే మరో లీడింగ్ రెండు మూడు చానెల్స్ వారికీ మద్దతుగా ఉన్నాయి, ఇక టీడీపీ విషయం గురించి అందరికి తెలిసిందే, ఎల్లోమీడియా అనే ట్యాగ్ కూడా ఉంది.
అయితే జనసేన పార్టీకి మాత్రం సరైన మీడియా అనేది లేదు.. 99 టీవీ జనసేన కు మద్దతు ఇస్తున్న కానీ బలంగా పవన్ వాయిస్ వినిపించటంలో వెనకబడింది. మరో ఒకటి రెండు చానెల్స్ మద్దతు ఇస్తున్న అవేమి చెప్పుకోదగినవి కాదు. కాబట్టి ప్రస్తుతం పవన్ కు మరో బలమైన మీడియా కావాలి. ఆ ఖాళీని భర్తీ చేయటానికి టాలీవుడ్ నిర్మాత ఒకరు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్ మీడియా రంగంలోకి దిగుతున్నారు. ఇందుకోసం పీపుల్స్ మీడియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ సంస్థ ను ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ ఛానెల్ ను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు. ఛానల్ ను ప్రారంభించటానికి ముందుగా 99 టీవీ, మహా టీవీ లో కొన్ని గంటలు స్లాట్స్ తీసుకోని వాటిలో తమ ఛానల్ తరుపున కార్యక్రమాలు ప్రసారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. మహా టీవీ వ్యవహారాలను జర్నలిస్ట్ స్వప్న చూసే అవకాశం ఉంది. 99టీవీ విషయం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ ఛానల్ ఖచ్చితంగా జనసేనకు బీజేపీకి సపోర్ట్ గా ఉండే అవకాశం ఉంది. అలాగని వైసీపీకి యాంటీ గా కూడా పనిచేయదు. ఎందుకంటే టిజి విశ్వప్రసాద్ కు వైసీపీ లోని కొందరు కీలక నేతలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయనే మాటలు వినిపిస్తునాయి.
ఇప్పటికే టిజి విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ తో కలిసి సంయుక్త నిర్మాణంలో 11 సినిమాలు చేయటానికి ఒక ఒప్పందం కూడా చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ పరిచయంతోనే ఇప్పుడు ఛానల్ కూడా ప్రారభించబోతున్నాడేమో టిజి విశ్వప్రసాద్. ఇది కార్యరూపం దాల్చితే జనసేన వాయిస్ వినిపించడానికి మరో వేదిక దొరికిందనే చెప్పుకోవాలి