బిగ్ న్యూస్ : జనసేన – బీజేపీ పొత్తు పెట్టుకుంటే సీఎం అభ్యర్థి ఎవరో క్లారిటీ ఇచ్చిన బీజేపీ..!
pawan kalyan: ఏపీలో అధికార వైకాపాను ఢీ కొట్టి తెలుగు దేశం పార్టీని పక్కకు నెట్టి బీజేపీ మరియు జనసేన పార్టీలు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారే అన్నట్లుగా పోటీ చేయడం వల్ల జరిగిన నష్టంను గుర్తించిన జనసేన పార్టీ ఖచ్చితంగా బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాల్సిందే అనుకుంటుంది. అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు సార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకత్వంతో మంతనాలు జరపడం చేశారు. ఇప్పుడు జనసేన మరియు బీజేపీల మద్య పొత్తు విషయమై కాస్త అనుమానాలు నెలకొన్నాయి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించిన బీజేపీతో జనసేనాని ఎందుకు కలవాలంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో ఉంటే జనసేనకు మర్యాద దక్కడం లేదు అనేది కొందరి అభిప్రాయం. అయినా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపాల్సిందే అంటూ నిర్ణయం తీసుకున్నారు.
pawan kalyan : సీఎం అభ్యర్థి పవన్..
పవన్ కళ్యాణ్ ను ఎప్పుడు కూడా బీజేపీ తక్కువ గా చూడటం లేదు అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పుకొచ్చాడు. సోము వీర్రాజు గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాడు. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే ఆయన నిర్మొహమాటంగా పవన్ కళ్యాణ్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటూ తమకు పలు సందర్బాల్లో మోడీ మరియు అమిత్ షా చెప్పారని ఈ సందర్బంగా సోము వీర్రాజు చెప్పుకొచ్చాడు.
Pawan kalyan : తిరుపతిలో మద్దతు కోసం పాట్లు..
పవన్ కళ్యాణ్ జపం చేస్తున్న బీజేపీ నాయకులు కేవలం తిరుపతిలో జరుగబోతున్న పార్లమెంట్ ఉప ఎన్నిక కోసమే అలా ప్రవర్తిస్తున్నారు అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో ఆయన ప్రచారం చేయకుంటే ఖచ్చితంగా బీజేపీ కనీసం రెండవ మూడవ స్థానం కూడా దక్కించుకునే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో టాక్. అందుకే మరో ఆలోచన లేకుండా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు జనసేనానిని నెత్తిన పెట్టుకుంటాం అన్నట్లుగా చెబుతున్నారు. ఆయనే మా సీఎం అభ్యర్థి అంటూ జనసైనికులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.