Hibiscus Tea : మందార పూల టీ.. బరువు తగ్గడంతో పాటు ప్రయోజనాలు ఎన్నో? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hibiscus Tea : మందార పూల టీ.. బరువు తగ్గడంతో పాటు ప్రయోజనాలు ఎన్నో?

 Authored By himanshi | The Telugu News | Updated on :8 May 2021,4:15 pm

Hibiscus Tea : అధిక బరువు అనేది శరీరంలో పేరుకు పోయిన కొవ్వు వల్లే అనే విషయం తెల్సిందే. శరీరంలోని కొవ్వు కరిగించడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు పొట్ట కూడా నార్మల్ గా అవుతుంది. అందుకే బరువు తగ్గడం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు కష్టపడి ఆసనాలు, వ్యాయామాలు చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆహారం విషయంలో కాస్త ఆంక్షలు పాటిస్తూ ఉంటారు. ఎంతగా ప్రయత్నిస్తూ ఉన్నా కూడా కొందరు లావు తగ్గడం జరగదు. అలాంటి వారి కోసం మందార టీ అద్బుత ఔషదం అంటూ నిపుణులు చెబుతున్నారు.

Hibiscus Tea : మందారం మంచి ఔషదం…

Advantages of Hibiscus Tea

Advantages of Hibiscus Tea

బరువు తగ్గాలనుకునే వారు మందార పువ్వు తో తయారు చేసిన టీ ని తాగడం వల్ల శరీరంలో ఉన్న వృదా కొవ్వు అంతా కరిగిస్తుంది. మందారంలో ఉన్న పాలీఫినాల్స్‌, ఆంథోసయనిన్స్‌, ఫినోలిక్‌ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని కొవ్వుపై అధికంగా ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. రెగ్యులర్‌ గా మాందారం టీ తాగడం వల్ల శరీరంలో పేరుకు పోయి ఉన్న కొవ్వును తొలగించడంతో పాటు కొత్తగా కొవ్వు పేరుకు పోకుండా చూసుకుంటుంది. పెద్ద పేగులో ఉండే కొవ్వు పదార్థాలను క్లీన్‌ చేయడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ పనిని మందార పువ్వు టీ చేస్తుంది.

Hibiscus Tea : మందార టీ తయారీ..

మందార పూలను బాగా ఎండబెట్టి తొడిమె తొలగించి భద్రపర్చుకోవాలి. 500 ఎంఎల్‌ నీటిని తీసుకుని వేడి చేసి అందులో 50 గ్రాముల ఎండు మందార పువ్వులను వేయాలి. కనీసం పది నిమిషాల పాటు మరిగిన తర్వాత వడగట్టుకోవాలి. ఆ నీటిని చల్లార్చి తాగేయాలి.

Hibiscus Tea

Hibiscus Tea

రుచి కోసం చెక్కర కాకుండా రెండు టీ స్పూన్‌ ల తేనెను వేసుకోవాలి. తేనె అందుబాటు లో లేకుంటే బెల్లం అయినా పర్వాలేదు. 500 ఎంఎల్‌ మందార పూల టీ ని రోజులో మూడు లేదా నాలుగు సార్లు తాగితే ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడుతుంటే మరెందుకు ఆలస్యం వెంటనే మీరు ఈ చిట్కాను ఫాలో అవ్వండి.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది