Beauty Tips : ముఖంపై ఉండే ఓపెన్ పోర్స్ ను తగ్గించే అద్భుతమైన చిట్కా ఏంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : ముఖంపై ఉండే ఓపెన్ పోర్స్ ను తగ్గించే అద్భుతమైన చిట్కా ఏంటో తెలుసా?

 Authored By pavan | The Telugu News | Updated on :4 April 2022,2:00 pm

Beauty Tips : ప్రస్తుతం కాలంలో అందం గురించి పట్టించుకోని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. అందరూ అందంగా కనిపించేందుకు వేలకు వేలు పెట్టి ట్రీట్ మెంట్లు తీసుకోవడం.. మేకప్ లు వేసుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే వీటి వల్ల కంటే కూడా న్యాచురల్ గా కనిపించే అందమే బాగుంటుంది. అలాగే ముఖంపై వచ్చే ఓపెన్ పోర్స్ తగ్గించుకునేందుకు చాలా మంది వివిిధ రకాలు మందులు, క్రీములు రాస్తుంటారు. మరి కొందరు వైద్యుల వద్దకు వెళ్లి ట్రీట్ మెంట్ కూడా తీస్కుంటుంటారు. కానీ వీటన్నిటి కంటే ఇంటి వద్దే ఉండి ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖ్యం కాంతివంతంగా తయారవడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ని రానివ్వవు.

అయితే ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గించి ముఖాన్ని అందంగా, కాంతి వంతగా తయారు చేసే ఆ అద్భుతమైన చిట్కా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నె తీసుకొని… గుడ్డులోని తెల్ల సొనాని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిసియేలా స్పూన్ తో తిప్పాలి. ప్రతిరోజూ దీన్ని ముఖం కింద నుంచి పైకి రాస్తూ… మర్దానా చేయాలి. ఒక అరగంట వరకు అలాగే మసాజ్ చేస్తూ… ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. తర్వాత ఐస్ క్యూబ్ తో ముఖంపై మళ్లీ మసాజ్ చేయాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల ముఖంపై ఉండే ఓపెన్ పోర్స్ పూర్తిగా తగ్గిపోతాయి. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా, అందంగా తయారవుతుంది.

Beauty Tips home remedy for decrease openporse problem

Beauty Tips home remedy for decrease openporse problem

గుడ్లలో ఉండే పోషక పదార్థాల వల్ల ముఖంపై గ్లో పెరుగుతుంది. అలాగే ముల్తానీ మట్టి వల్ల మొహంపై ముడతలు తొలగిపోతాయి. చర్మం యవ్వనంగా, కాంతి వంతంగా తయారయ్యేందుకు ముల్తానీ మట్టి ఎంతగానో ఉపయోగపడుతుంది.అయితే ఇలా ప్రతీ రోజూ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి రోజూ కుదరని వాళ్లు వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా చేసినా ఓపెన్ పోర్స్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ముఖంపై ఏర్పడే మృత కణాలను వదించుకోవచ్చు. అంతే కాదండోయ్ అందంపై ఆసక్తి లేదంటూ లైట్ తీస్కునే వాళ్లు చర్మంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. సీటీఎం అనే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేయడం వలన చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. ప్రతి రోజూ పడుకునే ముందు కచ్చితంగా మేకప్ తీలేయాలి. చర్మాన్ని సిటిఎం చేయడం వల్ల అధిక నూనె విడుదలై ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గించుకోవచ్చు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది