Oolong Tea : బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో పెట్టే అద్భుతమైన టీ…!
ప్రధానాంశాలు:
Oolong Tea : బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో పెట్టే అద్భుతమైన టీ...!
Oolong Tea : ప్రస్తుతం డయాబెటిక్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఐ సి ఎం ఆర్ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే భారతదేశంలో 100 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లుగా వెల్లడించింది. అయితే ఇతరుల కన్నా డయాబెటిక్ రోగుల జీవితం కాస్త కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వారి రక్తంలోని చక్కెర స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ చక్కెర స్థాయి పెరిగినట్లయితే ప్రమాదంలో పడినవారు అవుతారు. కొన్ని సందర్భాలలో డయాబెటిక్ పేషెంట్లు గుండెపోటు కిడ్నీ వ్యాధి కంటిచూపు తగ్గడం వంటి సమస్యల భారీన పడే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడటం కోసం ముందుగా చక్కెర, పాలు కలిపి టీని తాగడం నివారించాలి. దానికి బదులుగా ఊలాంగ్ టీ నీ తాగడం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంలో సహాయపడుతుంది.
Oolong Tea ఊలాంగ్ టీ లో లభించే పోషకాలు..
Oolong Tea ఊలాంగ్ టి లో విటమిన్ ఏ , విటమిన్ బి , మరియు విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, సెలీనియం , కాపర్, కెరోటిన్, మాంగనీస్, మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున దీనిని పోషకాల నిధి అని కూడా పిలుస్తారు.
ఊలాంగ్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు డయాబెటిక్ రోగులకు మంచిది.
టైప్ – 2 డయాబెటిస్ రోగులు ఈ టీ ని ప్రతి రోజు తాగడం వల్ల ఇది మీ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యాని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది.
బరువు తగ్గడం సులభం.
ప్రతిరోజు ఊలాంగ్ టీ ఒక కప్పు తాగడం వలన బరువు సులభంగా తగ్గుతారు. ఇది బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
Oolong Tea దంతాలను ధృడపరుస్తుంది.
చెన్నై వంటి దేశాలను ఊలాంగ్ టీ నీ సాంప్రదాయకంగా తాగుతారు. ఇది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దంతాలను ఎముకలను కూడా దృఢపరుస్తుంది.
Oolong Tea గుండెకు మేలు చేస్తుంది.
ప్రతిరోజు ఊలాంగ్ టీ నీ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.