Work From Home : ల్యాప్ టాప్ తో ఎక్కువ‌గా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా..? అయితే ఈ ఆరోగ్య స‌మ‌స్య‌లు గ్యారెంటీ..?

0
Advertisement

Work From Home : కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ అమలు నేపథ్యంలో చాలా మంది గతేడాది నుంచే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అది కూడా ఎక్కువ శాతం ల్యాప్ టాప్ లతోనే. ల్యాప్ టాప్ చాలా కన్వీనియెంట్ గా ఉంటుంది కాబట్టి దాన్నే ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ల్యాప్ టాప్ ను అధికంగా వినియోగించేవారు కొన్ని విషయాలను మర్చిపోకూడదు. రోజుకి ఏడెనిమిది గంటల పాటు ఇంట్లో నుంచే వర్క్ చేసేవాళ్లు ల్యాప్ టాప్ సెటప్ సరిగా లేకపోతే తీవ్ర శారీరక ఇబ్బందులకు గురవుతారు. చేతి వేళ్ల చివర్లు, మణికట్టు ప్రాంతంలో నొప్పులు వస్తాయి. ఎక్కువ సేపు కదలకుండా కూర్చొని ఉండటం వల్ల కాళ్లు తిమ్మిర్లు పడతాయి. కండరాల్లో, ఎముకల్లో లోపాలకు దారితీస్తుంది.

be careful with laptops in work from home
be careful with laptops in work from home

నరాలు కుచించుకుపోవటం..

ల్యాప్ టాప్ లతో వర్క్ ఫ్రం హోం చేసేవాళ్లలో ముఖ్యంగా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనే సమస్య తలెత్తుతుంది. దీనివల్ల తిమ్మిరి, బలహీనత చోటుచేసుకుంటాయి. చేయి పొడవునా, మణికట్టు మీదుగా వెళ్లే మధ్యస్థ నాడిపై ఒత్తిడి పెరిగినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. బొటనవేలి కదలికలను కంట్రోల్ చేసే ఈ నాడి ప్రభావం చిటికెన వేలు మినహా అన్ని వేళ్లపైనా ఉంటుంది. ల్యాప్ టాప్ లను గతంలో సెలవు రోజుల్లో లేదా ఇతర సందర్భాల్లో ఒకటీ రెండు గంటల పాటే వాడేవాళ్లు. ఇప్పుడు పర్మనెంట్ గా వాటితోనే పనిచేయాల్సిన పరిస్థితి.

be careful with laptops in work from home
be careful with laptops in work from home

ఒంటి మీదే కాదు.. : Work From Home

మన ఆరోగ్యం కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రత్యక్షంగా పాడవుతుంటే ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోం వల్ల పరోక్షంగా దెబ్బతింటోంది. కరోనా వైరస్ నుంచి దూరంగా జరగాలనుకుంటూ మనం క్రమంగా కంటి సమస్యలకు దగ్గరవుతున్నాం. ఆఫీసులో అయితే ఫిక్స్ డ్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి మనం కంప్యూటర్ స్క్రీన్ ని చూసే సమయం తక్కువగా ఉంటుంది. కార్యాలయంలో కుదురుగా కుర్చీలో కూర్చొని వర్క్ చేస్తాం. కానీ ఇంటి నుంచి పనిచేసేవాళ్లు ఎక్కువ టయాన్ని ల్యాప్ టాప్ తో గడపాల్సి వస్తోంది. దీంతో శారీరక ఆరోగ్యంతోపాటు కంటి ఆరోగ్యం కూడా ప్రతికూలంగా ప్రభావితం అవుతోంది.

ఆడవాళ్లలో..

be careful with laptops in work from home
be careful with laptops in work from home

వర్క్ ఫ్రం హోం చేసే ఆడవాళ్లలో ల్యాప్ టాప్ వినియోగం కారణంగా కండరాల, ఎముకల రుగ్మతలతోపాటు గర్భాశయ స్పాండిలైటిస్ అనే జబ్బు బారిన కూడా పడే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. పని ఒత్తడి వల్ల గర్భధారణ ఆలస్యమవ్వొచ్చని, రుతుక్రమం రెగ్యులర్ గా రాకుండా మధ్యలో ఆగిపోవచ్చని, ఊబకాయం వంటి సమస్యలు చుట్టుముడతాయని అంటున్నారు. ల్యాప్ టాప్ లో వేళ్లతో కంపోజింగ్ చేస్తాం కాబట్టి వేళ్లు వాస్తాయి. దీనివల్ల వస్తువులను పట్టుకోవటం కష్టంగా మారుతుంది. పిడికిలి పట్టలేం. ఇతరత్రా అనారోగ్యానికి కూడా గురయ్యే ఛాన్స్ ఉంది. పైన చెప్పిన సమస్యల్లో ఏది తలెత్తినా డాక్టర్లను సంప్రదించటం ఉత్తమం.

Advertisement