Beauty Tips : మొటిమలతో బాధపడుతున్నారా… అయితే ఇది ట్రై చేయండి…
Beauty Tips : మొటిమల వల్ల వచ్చే మచ్చలు గురించి బాధపడుతున్నారా. వాటిని పోగొట్టుకోవడం కోసం రకరకాల , ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారా. ఎందుకండీ అవి ఇవి ఉపయోగించి మీ స్కిన్ ని పాడు చేసుకుంటారు. మేమున్నాం కదా .మీ చర్మ సమస్యలను తగ్గించుకొని మీ ముఖాన్ని అందంగా కాంతివంతంగా కనిపించేలా చేయడానికి మేము ఒక ట్రిక్ ని తీసుకుని వచ్చాం .ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం ఫస్ట్ ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి చెబుతా.
తీసుకున్నాక ఫ్రూాట్ మొత్తం తినేసి తొక్క నీ పక్కన పెట్టుకోండి.తొక్కే కదా అని తీసి పడేయకండి. దాన్లో చాలా విటమిన్స్ ఉంటాయి. దాంతో ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.అయితే ఆ తొక్కలో ఉండే మెత్తని గుజ్జు వంటి పదార్థాన్ని తీసుకొని ఒక బౌల్ లో వేసుకోండి. ఈ గుజ్జులో ఒక చెంచా ఎవర్ యూత్ గోల్డెన్ ఫేషియల్ వేయండి .ఫేషియల్ కొనడానికి బడ్జెట్ లేదు అంటే పచ్చి పాలను కూడా వేసుకోవచ్చండి. వీటన్నిటిని కలిపి ఒక మిశ్రమంలో తయారు చేసుకోండి. మీకు కావాల్సిన పేస్ క్రీమ్ రెడీ అయిపోయింది .
అయితే వెళ్లి ఫస్ట్ ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకున్న మిశ్రమాన్ని ఒక 10 లేదా 15 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 1 లేదా 2 సార్లు చేయడం వలన మీ మొఖం పైన ఉండే నల్లని మచ్చలు పోయి మీ ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది .ఇలా చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాని చర్మవ్యాధులు కానీ రావు.ఈ ట్రిక్ ని ఎలాంటి వయస్సు వారైనా ఉపయోగించవచ్చు . ఇంకేంటి ఆలోచిస్తున్నారు వెళ్లి ట్రై చేయండి .మీ ముఖాన్ని మరింత అందంగా కాంతివంతంగా తయారు చేసుకోండి .