Beauty Tips : వీటిని తింటే ఎప్పటికీ వృద్ధాప్యం రానే రాదు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : వీటిని తింటే ఎప్పటికీ వృద్ధాప్యం రానే రాదు…!!

 Authored By aruna | The Telugu News | Updated on :14 August 2023,8:30 am

Beauty Tips : ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు అందంగా, యవ్వనంగా కనిపించాలి అనుకుంటారు.. అయితే ఎప్పటికీ యవ్వనంగా ఉండాలి అంటే ఈ పదార్థాలు తీసుకుంటే తప్పకుండా ఎప్పటికీ వృద్ధాప్యం రానే రాదు.. ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు.కొన్ని పదార్థాలను నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో లాభాలు ఉంటాయి. అవి ఏంటో ఏ ఏ పదార్థాలు ఏలా తీసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం.. ఒక స్పూన్ మెంతులు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఆ నీటిని తాగాలి. రోజు ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా ఉంటుంది.

ఇది పేగులని శుభ్రపరచి మలబద్ధకం సమస్య నుంచి బయటపడేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. ఇక అవిసె గింజలు వీటిలో పీచు యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బి మాంసం కృత్తులు, ఒమేగా త్రీ ఫ్యాటి యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రోజు నానబెట్టిన గింజలను తింటే బరువు తగ్గడంతో పాటు నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇక అంజీరా: దీంట్లో ఏ, బి విటమిన్లు, క్యాల్షియం, మాంగనీస్, సోడియం, పొటాషియం పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

Beauty Tips If you eat these you will never get old

Beauty Tips If you eat these you will never get old

ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి అనారోగ్య సమస్య లను తగ్గిస్తాయి. మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయి. అధిక రక్తపోటును తగ్గిస్తాయి. ఇక బాదం; రోజు నానబెట్టిన ఐదారు బాదం తినడం వలన మెదడు చురుకుగా ఉంటుంది. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గడంతో పాటు బరువు నియంత్రణలో ఉంటుంది. ఎండు ద్రాక్ష వీటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. వీటిని నిత్యం తీసుకోవడం వలన చర్మం ఆరోగ్యంగా మారడంతో పాటు మీ చర్మం కాంతివంతంగా మారుతుంది..రోజు రాత్రిపూట 10 ,12 ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇనుము సమృద్ధిగా అందుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది