Beauty Tips : ఎటువంటి ఖర్చు లేకుండా .. చాలా తక్కువ సమయంలో .. గోర్లు అందంగా తయారు చేసుకోండి ఇలా ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : ఎటువంటి ఖర్చు లేకుండా .. చాలా తక్కువ సమయంలో .. గోర్లు అందంగా తయారు చేసుకోండి ఇలా ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :20 November 2022,10:10 pm

చాలామంది ఆడవారికి గోర్లు పెంచుకోవడం అలవాటు ఉంటుంది. రకరకాల నెయిల్ పాలిష్లు వేసుకోవడం నెయిల్ ఆర్ట్స్ చేయించుకోవడం కూడా చేస్తుంటారు. అయితే కొంతమంది గోర్లు పెరగటం లేదని వచ్చిన గోర్లు విరిగిపోతున్నాయని వివిధ రకాల ట్రీట్మెంట్స్ తీసుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ ఎటువంటి ఖర్చు లేకుండా చాలా తక్కువ సమయంలో ఇంట్లోనే ఈజీగా గోర్లను పెరిగేలా చేసుకోవచ్చు. ఈ చిట్కా ట్రై చేస్తే గోర్లు విరిగిపోకుండా చాలా అందంగా, బలంగా తయారవుతాయి. దీనికోసం ముందుగా ఒక బకెట్ తీసుకొని అందులో చేతులు మునిగేంత వరకు గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఇందులో నిమ్మరసం వేసి రెండు చేతులను 20 నిమిషాల పాటు ఆ నీళ్లలో ఉండనివ్వాలి.

తర్వాత రసం పిండిన నిమ్మ చెక్కతో గొర్లపై ఒకసారి స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన గోర్లపై పేరుకుపోయిన దుమ్ముపోయి చాలా నీట్ గా కనిపిస్తాయి. అలాగే విటమిన్ సి గోర్లలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి గోర్లు బలంగా పెరిగేలా సహాయపడుతుంది. తర్వాత పొడి క్లాత్ తో చేతులను తుడుచుకోవాలి. ఇలా చేయడం వలన గోర్లు బలంగా తయారవుతాయి. తర్వాత గోర్లు పసుపు పచ్చగా మారడం క్లియర్ అవుతాయి. అలా ఉండడం వలన గోర్లు చూడడానికి చాలా చిరాగ్గా అనిపిస్తాయి. పచ్చదనం పోగొట్టుకోవడానికి ఒక వాడిని బ్రష్ తీసుకొని దానిమీద కొంచెం పేస్ట్ కొంచెం పంచదార పొడి వేసి గోర్లని రెండు నిమిషాల పాటు బ్రష్ తో రుద్దాలి.

Beauty Tips on use these pack for nails

Beauty Tips on use these pack for nails

ఇలా చేయడం వలన గోర్లపై ఉండే పసుపు పచ్చ రంగు పోయి గోర్లు తెల్లగా అందంగా కనిపిస్తాయి. గోర్లు పెరగడం కోసం ఈ ఆయిల్ ని తయారు చేసుకొని ఉపయోగించినట్లయితే మూడు రోజులలో గోర్లు బాగా పెరుగుతాయి. దీనికోసం వెల్లుల్లి రెబ్బలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను గాజు సీసాలో వేసి నాలుగు లేదా ఐదు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు అప్లై చేసి పడుకోవడం వలన మూడు రోజులలో గోర్లు విపరీతంగా పెరుగుతాయి. ఈ చిట్కా ట్రై చేస్తే గోర్లు చాలా అందంగా తయారవుతాయి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది