Boda Kakarakaya : ఖరీదైనది అని… భోడ కాకరగాయను వదిలేయకండి… దాని ప్రయోజనాలను కోల్పోతారు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Boda Kakarakaya : ఖరీదైనది అని… భోడ కాకరగాయను వదిలేయకండి… దాని ప్రయోజనాలను కోల్పోతారు…?

 Authored By ramu | The Telugu News | Updated on :16 July 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Boda Kakarakaya : ఖరీదైనది అని...భోడ కాకరగాయను వదిలేయకండి... దాని ప్రయోజనాలను కోల్పోతారు...?

Boda Kakarakaya : సాదానంగా కాకరకాయలు చేదుగా ఉంటాయి. అందులో అదే జాతికి చెందిన భోడ కాకరకాయ కూడా మీకు తెలుసు. వీటితో కూర చేస్తే దాని టేస్ట్ అదిరిపోతుంది. మరి ఈ బోడ కాకరకాయలు మార్కెట్లో తక్కువ ధరకు అస్సలు లభించదు. ఎక్కువ ఖరీదై ఉంటాయి. కాబట్టి, కొందరు వీటిని కొనాలంటే ఆలోచిస్తారు. భోడ కాకరకాయ ఎంత ఖరీదైన సరే, వీటిని తినడం మాత్రం మానుకోకండి. ఎందుకంటే, దీని ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అంటున్నారు నిపుణులు. ఇవి కేవలం వర్షాకాలంలో ఎక్కువగా మనకి లభిస్తాయి. పెద్ద కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది. కానీ ఈ బోడ కాకరకాయ మాత్రం అస్సలు చేయదు ఉండదు. పెద్ద కాకరకాయ తినలేని వారు,ఈ బోడ కాకరకాయని తిని దీని లాభాలను పొందవచ్చు. ఈ బోడ కాకరకాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Boda Kakarakaya ఖరీదైనది అని భోడ కాకరగాయను వదిలేయకండి దాని ప్రయోజనాలను కోల్పోతారు

Boda Kakarakaya : ఖరీదైనది అని… భోడ కాకరగాయను వదిలేయకండి… దాని ప్రయోజనాలను కోల్పోతారు…?

కాకరకాయలని మార్కెట్లలో చూస్తే వెంటనే నోరూరుతుంది వాటిని తెచ్చి ఉండేసుకోవాలి అనిపిస్తుంది కానీ దాని ధర చూస్తే మాత్రం ఆకాశానికి అంటుకునేలా ధరలు ఉన్నాయి. కొనలేని పరిస్థితిలో కాకరకాయని కొనడం మానేస్తున్నారు. కానీ దీని లాభాలు చాలా ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే భోడ కాకరకాయలోని విటమిన్స్ చికెన్ లో, మటన్ లో లభించే పోషకాలు ఇందులో ఉంటాయంట. కాబట్టి చాలామంది బోడ కాకరకాయలని తినాలని చెబుతుంటారు ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి ఎక్కువగా లభిస్తుంటాయి. సీజన్లో బోడ కాకరకాయ తినడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు దరి చేరవట అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ కాకరకాయను మీ డైట్ లో చేర్చుకోమని నిపుణులు చెబుతూ ఉంటారు.

Boda Kakarakaya బోడ కాకరకాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

భోడకాకరకాయలో శరీరానికి కావలసిన అనేకారకాల పోషకాలు కలిగి ఉంటాయి. విటమిన్స్ అమెనో ఆమ్లాలు, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అందుకే వర్షాకాలంలో తప్పకుండా వీటిని ఉంటే వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా డయాబెటిస్ ఉన్నవారు, వర్షాకాలంలో భోడ కాకరకాయలు తింటే రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రణలోకి వస్తాయి.ఇందులో గ్లైసిమిక్ ఎక్కువగా ఉండటం చేత డయాబెటిస్ రోగులకు చాలా మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. కాదు బోడ కాకరకాయలో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది.అలాగే ఆల్కలాయిడ్స్ ఫ్లెవనాయిడ్స్, ఫాస్ఫరస్ వంటివి కూడా మోతాదుల్లో లభిస్తాయి. అందువలన భోడ కాకరకాయ తినడం చేత  క్యాన్సర్ వంటి సమస్యలు దరి చేరవు. ఇది రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించి గుండె సమస్యలను నివారిస్తుంది. భోడ కాకరకాయ వర్షాకాలంలో తింటే, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబు, దగ్గు,వైరల్ ఫీవర్స్ వంటివి నుంచి కాపాడుతుంది.ఈ బోడ కాకరకాయలు విటమిన్ సి క్యాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి,ఎముకలకు బలాన్ని అందిస్తుంది. అంతేకాకుండా బోడ కాకరకాయ ఎక్కువగా తీసుకుంటే పొటాషియం ఎక్కువగా అందుతుంది. తద్వారా రక్తపోటు నివారించబడుతుంది.ఇది రక్తపోటుకు దివ్య ఔషధం అంటున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకునే వారికి బోడ కాకరకాయ చాలా మంచిదట. ప్రతిరోజు తింటే బరువుని తగ్గించుకోవచ్చు. అంతేకాక,దీనిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ప్రతిరోజు తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.ఆకలిని తగ్గిస్తుంది.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది