Brain Stroke : 7 రోజుల ముందే బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను కనిపెట్టవచ్చు… ఎలాగో తెలుసా.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Brain Stroke : 7 రోజుల ముందే బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను కనిపెట్టవచ్చు… ఎలాగో తెలుసా.?

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైనది. ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు.మనం మారుతున్న ఈ ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్ల వలన బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మెదడుకి సరిగా రక్త సరఫరా కాకపోవటం వలన మెదడులోని రక్తనాళాలు పగిలిపోవడం దీనికి కారణం. ఆక్సిజన్ సరిగా అందకపోవటం వల్ల కూడా మెదడు పనిచేసే తీరు ఆగిపోతుంది. దీనినే బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 March 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Brain Stroke : 7 రోజుల ముందే బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను కనిపెట్టవచ్చు... ఎలాగో తెలుసా.?

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైనది. ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు.మనం మారుతున్న ఈ ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్ల వలన బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మెదడుకి సరిగా రక్త సరఫరా కాకపోవటం వలన మెదడులోని రక్తనాళాలు పగిలిపోవడం దీనికి కారణం. ఆక్సిజన్ సరిగా అందకపోవటం వల్ల కూడా మెదడు పనిచేసే తీరు ఆగిపోతుంది. దీనినే బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే చికిత్స అందకపోతే ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్అనేది ఎప్పుడు హఠాత్తుగా రాదు. ఈ స్ట్రోక్ రావడానికి ముందు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.ఓ అధ్యయనం ప్రకారం స్ట్రోక్ వచ్చిన వారిలో 43% శాతం మందివారం ముందే ఈ లక్షణాలు అనుభవించారని శాస్త్రవేత్తలు తెలిపారు.

వారం ముందే కనిపించే లక్షణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం…వారం ముందే మనకు కనిపించే లక్షణాల్లో చేతులు, కాళ్లలో బలహీనత ముఖ్య కారణం.ఈ రెండు భాగాలకి తిమ్మిరి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది.ఇలాంటి సమయంలో తిమ్మిరి అనేది ఎప్పుడు ఉన్నట్లయితే వెంటనే చికిత్స చేయించుకోవడం మంచిది.ఈ స్ట్రోక్ కి ముందు జ్ఞాపకశక్తి అనేది తగ్గుతుంది అని నిపుణులు తెలియజేశారు. దీనిలోని భాగంగా దేని పైన దృష్టి లేకపోవడం, పాత విషయాలు గుర్తు రాకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. 7 రోజుల ముందే తల తిరగటం లాంటి సమస్యలు వస్తాయి.

ఎలాంటి కారణం లేకపోయినా ప్రతిరోజు తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తే వెంటనే వైద్యం చేయించుకోవాలని నిపుణులు చెపుతున్నారు…
మనం సరిగ్గా మాట్లాడలేకపోవటం కూడా స్ట్రోక్ కి కారణం.పదాలను స్పష్టంగా పలక లేకపోయినా, మాట సరిగా రాకపోయినా ఏడు రోజుల ముందు కనిపించే లక్షణాల్లో ఇది ఒకటి.ఈ స్ట్రోక్ అనేది కంటి చూపు పైన కూడా ప్రభావం చూపుతుంది.కంటి చూపు సరిగా లేకపోయినా, హఠాత్తుగా దృష్టి తగ్గటం లాంటి లక్షణాలు ఉంటాయి. స్ట్రోక్ కి ఏడు రోజుల ముందు శరీర సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.నడవటం మీకు ఇబ్బందిగా అనిపించిన వెంటనే అవసరమైన చికిత్స తీసుకోవాల్సిందిగా వైద్య నిపుణులు చెబుతున్నారు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది