Heel Pain : మడమ నొప్పికి కారణాలేంటి ..??ఇంట్లోనే చికిత్స ఎలా చేయాలి ..??
ప్రధానాంశాలు:
Heel Pain : మడమ నొప్పికి కారణాలేంటి ..?
?ఇంట్లోనే చికిత్స ఎలా చేయాలి ..??
మడమ నొప్పి అనేది యువకులు, మధ్య వయస్కులు, వృద్ధుల్లో కనిపించే సాధారణ సమస్య
Heel Pain : మడమ నొప్పి అనేది యువకులు, మధ్య వయస్కులు, వృద్ధుల్లో కనిపించే సాధారణ సమస్య. కారణాలు చాలా ఉన్నప్పటికీ అత్యంత ముఖ్యమైన కారణం ప్లాంటర్ ఫాసిటిస్. ఇది మడమ ఎముక , కాలి మధ్య సంబంధాన్ని సృష్టిస్తుంది. అంటే పాదాల మధ్య కణజాలాల మందపాటి పాంట్ యొక్క వాపును కలిగించే వ్యాధి ఇది. ఇది చీల మండలంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇది సాధారణంగా నడవడానికి లేచినప్పుడు ప్రారంభమవుతుంది. ఈ సమస్య ఎక్కువగా అథ్లెటిక్స్ లలో, రన్నర్లలో కనిపిస్తుంది.
అధిక బరువు ఉంటే కాలికి సరిపడని షూస్ ధరించడం వలన కూడా ఇలాంటి నొప్పి వస్తుంది. ఇది పాదాల దిగువన నొప్పికి దారితీస్తుంది. నడక సరిగా లేకపోవడం, ఊబకాయం, నేల గట్టిగా ఉండటం, సరైన చెప్పులు వేసుకోకపోవడం ఆర్థరైటిస్ వంటి నొప్పులకు దారి తీస్తాయి. నొప్పి వారం కన్నా ఎక్కువ రోజులు ఉన్న నడవడానికి ఇబ్బందిగా ఉన్నా వైద్యుడిని సంప్రదించాలి. మడమ నొప్పి నెల రోజుల కన్నా ఎక్కువ ఉంటే సర్జరీ చేస్తారు. ఫిజియోథెరపీ చేసుకున్న కూడా నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇక మడవ నొప్పికి ఉపశమనం పొందాలంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించవచ్చు.
ముందుగా పాదానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. శారీరక శ్రమ, నడక తగ్గించాలి. ఎక్కువసేపు నిలబడకూడదు. నొప్పి ఉన్న దగ్గర ఐస్ పెట్టడం, సున్నితంగా మసాజ్ చేయడం, కాలి పిక్కలను, పాదాలను సాగదీసే వ్యాయామాలను చేయాలి. ఇవన్నీ పాటించిన తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. ఇక ఒక కప్పు వేడి చేసిన పాలలో ఒక టీ స్పూన్ పసుపు, కొంచెం తేనె వేసి కలిపి రోజు రెండు , మూడు సారు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఎప్సం సాల్ట్ ను అరబకేట్ నీళ్లలో వేసి అందులో కాళ్ళను ఉంచాలి. 20 నిమిషాల పాటు ఉంచడం వలన రిలీఫ్ వస్తుంది. ఒక కప్పు వేడి నీళ్లలో పావు టీ స్పూన్ ఆపిల్ సైడ్ వెనిగర్ వేసి అందులో కాటన్ క్లాత్ ముంచి నొప్పి ఉన్నచోట కాపడం పెట్టాలి. ఇలా చేయడం వలన కూడా మడమ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.