Diabetes : ఈ డ్రింక్ మధుమేహంతో బాధపడే వారికి దివ్య ఔషధం… చక్కెర స్థాయిని పెరగకుండా తగ్గిస్తుంది…
Diabetes : ప్రస్తుతం ఎంతోమంది ఈ డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నారు. ఈ మధుమేహం బాధితులు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పుల్ని చేసుకోవాలి. ఎందుకనగా ఆహారం అనేది ఈ డయాబెటిక్ వ్యాధులకి ఎంతో ముఖ్యమైనది. అయితే ఈ డయాబెటిస్ బాధితులు పర్మినెంట్ గా మందులు వాడాలి. అదేవిధంగా వీటిని వాడుతూ కొన్ని చిట్కాలను కూడా పాటిస్తే ఈ మధుమేహం కంట్రోల్లో ఉంటుంది.
ఈ మధుమేహం అదుపులో ఉండడానికి ఒక తమలపాకు, నల్ల జీలకర్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే. ఒక కప్పు నీటిలో ఒక తమలపాకు ముక్కలుగా కట్ చేసుకుని దానిలో అర స్పూన్ నల్ల జిలకర వేసి దానిని నైట్ అంతా అలాగే ఉంచాలి. మరునాడు ఉదయం ఆ నీటిని వడకట్టి తీసుకోవాలి. ఇలా నిత్యము తీసుకున్నట్లయితే మధుమేహం కంట్రోల్లో ఉండడమే కాకుండా, ఎన్నో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ మధుమేహం కారణంగా వచ్చే కొన్ని వ్యాధులకి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో వాడినటువంటి తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ కారణంగా వచ్చే ఆక్సికరణ స్ట్రెస్ ను తగ్గిస్తుంది.
అదేవిధంగా నల్ల జిలకర ఈ జీలకర్రకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఇది ఆయుర్వేద షాప్ లో విరివిగా దొరుకుతుంది. అయితే ఈ నల్ల జీలకర్ర డ్రింక్ ను సేవించినట్లయితే మధుమేహం కంట్రోల్లో ఉండి. షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. మధుమేహంతో బాధపడేవారు నిత్యము 45 నిమిషాలు ఎక్సర్సైజులు వాకింగ్ లాంటివి చేస్తూ ఉండాలి. అలాగే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ మధుమేహం బాధితులు ఈ వ్యాధిని అస్సలు నెగ్లెక్ట్ చేయవద్దు. ఇలా చేసినట్లయితే మెదడు, కిడ్నీ, కళ్ళు, గుండె లాంటి వాటిపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ మధుమేహం వచ్చిన మొదటిలోనే దీని గురించి కొన్ని జాగ్రత్తలు వహించాలి. అయితే మందులను వాడుతూ ఈ కాషాయంను తయారు చేసుకుని తాగినట్లయితే మంచి ఉపశమనం కలుగుతుంది.