Pillow Disease : మీరు వాడే పిల్లో కవర్ వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా…!!
Pillow Disease : ఇంట్లో అందంగా ఉండడం కోసం ఎన్నో రకాల సోఫా సెట్లు వాటిపై ఫిల్లోస్ రకరకాలుగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇంట్లో మనం వాడే పిల్లో కవర్ల వలన ఎన్నో వ్యాధులు వస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎన్నోసార్లు ప్రజలు చర్మ సమస్యలకు అనేక రకాల నివారణను ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ చర్మ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. చర్మం కాకుండా జుట్టులో చుండ్రు తలలో మురికి ఇంకా ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే చర్మం లో మొటిమలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఎన్నో రకాల మచ్చలు కనిపిస్తాయి.
ఈ చర్మ సమస్యలు చర్మం రంగు మొత్తాన్ని దూరం చేస్తాయి. చర్మం సమస్యల నుండి ఉపశమనం పొందడానికి క్రీములు మరియు మందులను వాడుతూ ఉంటారు. అయితే ఇలా మందులు వాడడం కంటే మీరు వాడే పిల్లో కవర్స్ పై కొంచెం శ్రద్ధ పెడితే మీరు ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.. ప్రముఖ కాస్మోటాలజిస్ట్ తెలిపిన వివరాలు విధానం ప్రతివారం దిండు కవర్ను మార్చకపోతే చాలా చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని ఆయన తెలిపారు. మీరు ప్రతివారం పిల్లో కవర్ను మార్చకపోతే అలాగే చర్మ సమస్యలకు చికిత్స పొందకపోతే ఈ సమస్య జీవితాంతం అలాగే ఉంటుంది.
ప్రతివారం పిల్లో కవర్ను మార్చడం వలన కలిగే ఉపయోగాలు.. ప్రతివారం పిల్లో కవర్ను మార్చుకుంటే చర్మానికి ఎన్నో ఉపయోగాలు వస్తాయని డాక్టర్ గీతిక తెలియజేశారు. అయితే ఈ విషయాన్ని మీరు తెలుసుకోకపోతే మీరు నిత్యము మీ డెడ్ స్కిన్తో నిద్రపోతారు. అలాగే మీ కణాలలో ఎన్నో రకాల బ్యాక్టీరియా ప్రవేశిస్తూ ఉంటుంది. దీని వలన చర్మం చనిపోతుంది. ముఖంపై ఎన్నో మచ్చలు వస్తాయి. కాబట్టి ప్రతివారం పిల్లో వేసే కవర్ను మార్చుకోవడం చాలా మంచిది. మొత్తం దిండును కూడా ఆరు నెలలకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి. లేదా డ్రై క్లీనింగ్ చేయాలి.. సిల్క్ కవర్ మంచిది : హెల్త్ లైన్ నుండి వచ్చిన ఒక న్యూస్ ప్రకారం దిండుకేసి కవర్ పట్టుతో చేసినట్లయితే బ్యాక్టీరియా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మరియు మొటిమలకు కారణం కాకుండా ఉంటుంది. చర్మం ఆరోగ్యానికి కాటన్ కవర్ కంటే సిల్క్ కవర్ మంచిదని ఓ పరిశోధనలో తేలింది. సిల్క్ కవర్ వాడడం వలన ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉండదు… పిల్లోస్ హానికరమైన దుమ్ము, కణాలు పెంపుడు జంతువులు, వెంట్రుకలు, నూనె ,చనిపోయిన చర్మం శిధిలాలు మరియు బ్యాక్టీరియాలను కలిగి ఉంటాయని డాక్టర్ గీతిక తెలియజేశారు. ఇవన్నీ మన చర్మాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. దాంతో చర్మం విరిగిపోతుంది. బ్యాటరీ వల్ల ముఖంపై మొటిమలు మచ్చలు వస్తుంటాయి. ఆ పరిస్థితిలో మీరు మీ చర్మాన్ని ఎంత జాగ్రత్త చూసుకున్నా అది సరి అయింది. కాదు కావున దిండు యొక్క షేర్ నుండి ప్రతి రాత్రి అది అనేక వ్యాధులు మూలాలను పొందుతూ ఉంటుంది. కావున దిండు కేసే కవర్ని కచ్చితంగా వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి.