Hair Tips : విలేజ్ అమ్మాయిల పొడవాటి జుట్టు సీక్రెట్ ఏంటో మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : విలేజ్ అమ్మాయిల పొడవాటి జుట్టు సీక్రెట్ ఏంటో మీకు తెలుసా..?

 Authored By prabhas | The Telugu News | Updated on :4 January 2023,3:00 pm

Hair Tips : ప్రతి ఒక్కరికి జుట్టు పొడవుగా, ఒత్తుగా అందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే విలేజ్ అమ్మాయిలు జుట్టు పొడవుగా, ఒత్తుగా అందంగా ఉంటుంది. అదేవిధంగా మీ జడ కూడా ఒత్తుగా, పొడవుగా ఉండాలి అంటే ఈ టిప్ ని ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా మందార పువ్వుల్ని తీసుకోవాలి. తర్వాత ఈ మందార పువ్వులు వద్దు అనుకున్న వాళ్ళు మందార పౌడర్ కూడా తెచ్చి వాడుకోవచ్చు. మనం నిత్యం ఇంట్లో వండుకునే బియ్యం ఒక గ్లాస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల నీళ్లను పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. దాని తర్వాత పది మందార పువ్వులను తొడిమెలు తీసి నానబెట్టుకున్న బియ్యంలో వేసుకోవాలి.

తర్వాత వాటిని చేతితో బాగా మెత్తగా మెదుపుకోవాలి. లేదా మిక్సీలో కూడా పేస్టులా చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత కలమంద తీసుకొని దానిని శుభ్రం చేసి లోపల ఉన్న గుజ్జుని తీసుకొని ఈ మందార మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలమంద జెల్ నేచురల్ వద్దు అనుకునేవాళ్లు షాప్ లో దొరికే అలోవెరా జెల్ కూడా వాడుకోవచ్చు. దాని తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పల్చటి గుడ్డలో వేసి వడకట్టుకోవాలి. తర్వాత దీనిలో ఒక స్పూన్ కస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వద్దు అనుకున్న వాళ్లు కొబ్బరినూనె కూడా వాడుకోవచ్చు. ఈ నూనె వేయడం ఇష్టం లేని వాళ్ళు ఈ మిశ్రమాన్ని అలాగే కూడా బాగా పట్టించవచ్చు. దీనిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం 20 రోజులు ఉంటుంది.

Do you know the long hair secret of village girls

Do you know the long hair secret of village girls

ఈ మిశ్రమం జెల్ గా ఉంటుంది. దీన్ని జుట్టుకి బాగా అప్లై చేసుకోవాలి. దీనిని అప్లై చేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు పాటు బాగా మరద్దన చేయాలి. ఈ విధంగా మరద్దన చేయడం వలన బెడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది. ఇలా జరగడం వలన జుట్టు రాలడం ఆగిపోతుంది. దీనిని పెట్టుకున్న తర్వాత ఒక అర్థగంట పాటు ఉండాలి. తర్వాత ఏదైనా గాడ్త తక్కువ గల షాంపుతో లేదా కుంకుడుకాయలతో శుభ్రంగా స్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని వారంలో రెండుసార్లు అప్లై చేయడం వలన జుట్టు రాలడం తగ్గిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే బట్టతల వచ్చిన వాళ్లకి కూడా తిరిగి జుట్టు మొలుస్తుంది. ఇది నాచురల్ చిట్కా కావున ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. ఈ చిట్కా మగవారు, ఆడవారు, చిన్న పిల్లలు కూడా అప్లై చేయవచ్చు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది