Symptoms : మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా… జరభద్రం… ప్రమాదంలో పడ్డట్టే..!
ప్రధానాంశాలు:
Symptoms : మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... జరభద్రం... ప్రమాదంలో పడ్డట్టే..!
Symptoms : ప్రస్తుతం మారుతున్నటువంటి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణం చేత ఇతర ఆరోగ్య సమస్యలు మనల్ని ఎంతగానో వేధిస్తున్నాయి. ముఖ్యంగా జర్ణ సంబంధిత సమస్యలు అధికంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అంతేకాక ఫ్యాటీ లివర్ సమస్య అనేది ఒక సర్వ సాధారణంగా మారింది అని చెప్పొచ్చు. ఈ ఫ్యాటీ లివర్ అనేది కాలేయములో కొవ్వు పేరుకుపోయి ఎంతో తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నది. సాధారణంగా ఈ కొవ్వు కాలేయ వ్యాధి లక్షణరహితం గా ఉన్నప్పటికీ కూడా కొన్ని శరీర భాగాలు ఉబ్బుతాయి. ఇది ఉనికిలో ఉండవచ్చు అని అంటున్నారు. ఇక్కడ ఐదు శరీర భాగాలు గనక ఉబ్బితే మీరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అని అర్థం చేసుకోవాలి. కావున ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళకి శరీరం చూపించే వార్నింగ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
పొత్తికడుపు : పొత్తికడుపు వాపు అనేది కొవ్వు కాలేయ వ్యాధికి సంబంధించినటువంటి ఎంతో సాధారణ సంకేతాలలో ఒకటి అని చెప్పొచ్చు. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వలన పొత్తికడుపులో వాపు అనేది వస్తుంది. ఇది సాధారణంగా నిలబడి ఉన్నప్పుడు దీనిని గమనించవచ్చు. అలాగే పక్కటెముకలకు దిగువ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉబ్బినట్లుగా కూడా కనిపిస్తుంది. అలాగే వాపు నొప్పి సున్నితత్వంలో కలిసి ఉన్నట్లయితే తొందరగా వైద్యుని సంప్రదించటం మంచిది..
చీలమండలు : ఈ చీల మండలు వాపులు ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతం అని చెప్పొచ్చు. అలాగే కాలేయంలో ఎక్కువ కొవ్వు ఉన్నప్పటికీ శరీరంలో ద్రవం అనేది పేరుకు పోతుంది. దీంతో చీలమండలు మరియు పాదాలలో ద్రవం అనేది పేరుకుంటుంది. అయితే మీకు చీలమండలు వాపు ఉన్నట్లయితే అది కేవలం ఫ్యాటి లివర్ డిసీజ్ కంటే ఎంతో తీవ్రమైన ఒక సూచన కావచ్చు. కావున వైద్య సహాయం తీసుకోవడం ఎంతో అవసరం…
కళ్ళు : కళ్ళల్లో వాపు కూడా ఫ్యాటిల్ లివర్ సమస్యకు సంకేతం కావచ్చు. అలాగే కాలేయంలో ఎక్కువ కొవ్వు ఉన్నప్పుడు ఇది అనేది వస్తుంది. దీని వలన కళ్ళ చుట్టూ ద్రవం అనేది పెరుగుతుంది. దీనివలనకళ్ళు అనేవి ఉబ్బుతాయి. ఈ లక్షణాలని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకు అంటే. ఇది ఎంతో తీవ్రమైన దానికి సంకేతం కావచ్చు అని అంటున్నారు…
పాదాలు : కాలేయంలో కొవ్వు అనేది పెరిగినప్పుడు వ్యర్థ ఉత్పత్తులను ప్రాసెస్ చేయకుండా నియంత్రించటం వలన పాదాలు అనేవి ఉబ్బుతాయి. ఈ లక్షణం నొప్పి లేఖ సున్నితత్వంలో కలిసి ఉన్నట్లయితే మీరు వెంటనే వైద్యులను సంప్రదించాలి..
కీళ్లు : కీళ్ల నొప్పులు మరియు దృఢత్వం కూడా ఫ్యాటీ లీవర్ కు సంకేతం కావచ్చు. అలాగే కాలేయంలో ఎక్కువ కొవ్వు కారణం చేత శరీరంలో ద్రవం అనేది పెరుగుతుంది. ఈ ద్రవం కీళ్ల చుట్టూ చేరి వాటిని గట్టిగా చేసి ఎంతో బాధాకరంగా మారుస్తుంది. ఈ లక్షణాలు రోజు మీకు కనిపించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించండి…