Health Tips : అల్లోపతి, హోమియోపతి రెండింటిలో ఏది బెస్ట్… ఇంతకీ వైద్యులు ఏమంటున్నారంటే…
Health Tips : రోగాన్ని నయం చేయడానికి అలోపతి విధానాన్ని పాటించాలా లేక హోమియోపతి విధానాన్ని పాటించాలా అనే సందేహం ఎప్పటినుంచో ఉంది. ఈ చర్చ కొనసాగుతున్న సమయంలో రెండు విధానాలను పాటించడం రోగి ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటారు. చాలామంది అలోపతి వైద్యులు ప్రత్యామ్నాయ వైద్య విధానం ఉండదని భావనలో ఉంటారు. అయితే కొన్ని ఆయుర్వేద ఔషధాలలో లోహాలను గుర్తించిన సందర్భాలు సైతం ఉన్నాయి. అలోపతికి ప్రత్యామ్నాయ చికిత్స కోవిడ్ 19 వంటి వ్యాధులను నయం చేయగలరని వాదిస్తున్న క్రమంలో ఇది మనిషి జీవితానికి సంబంధించిన విషయమని గుర్తించాలి. అలోపతి ద్వారా మాత్రమే నయమయ్యే కొన్ని వ్యాధులు ఉంటాయి.
అలాంటి సందర్భాలలో ఆయుర్వేదం లేదా మారేదేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు పనిచేయవనే విషయాన్ని రోగి గుర్తించాలి. ఒక వ్యక్తి ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు అతను ప్రతిదానిని నమ్ముతాడు. అయితే వైద్యం కోసం ఎంచుకుంటున్న మార్గాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కొన్ని రకాల ఆయుర్వేదిక్ ఔషధాల్లో అలోపతి మెడిసిన్ ఉన్నట్లు కొన్ని పరిశోధనలో తేలింది. ఇదే విషయమై ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ కుషాల్ బెనర్జీ మాట్లాడుతూ హోమియోపతి, అలోపతి చికిత్సలను కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. అయితే రోగి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
అయితే చాలామంది రోగులు తాము ఏ వైపు విధానంలో చికిత్స తీసుకుంటున్నాము వైద్యులకు తెలపరు. వైద్యుడు తనకు తెలిసిన హద్దులకు కట్టుబడి ఉండాలి. హోమియోపతి వైద్యుడు తన ఫీల్డ్ గురించి మాత్రమే మాట్లాడాలి. అలోపతికి అతని వైద్యశాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానం మాత్రమే ఉంటుంది. అయితే వీరిద్దరూ కలిసి ఒక రోగికి చికిత్స అందించగలరు అని కుషాల్ వివరించారు. రెండు వైద్య విధానాలను ఇష్టారాజ్యంగా పాటించడం కూడా ప్రమాదకరం. చాలా సందర్భాల్లో ఒక రోగి కొన్ని వారాలపాటు అలోపతి చికిత్స తీసుకుంటాడు. అది పనిచేయకపోతే హోమియోపతికి వెళతాడు. అది కూడా పనిచేయకపోతే మళ్లీ అలోపతి చికిత్స తీసుకుంటాడు. దీంతో వ్యాధి నియంత్రణ కఠిన తరంగా మారే అవకాశం ఉంటుంది.