Health tips : నీరు హై బీపీని తగ్గిస్తుందా.? నిత్యం ఎన్ని లీటర్ల నీటిని తీసుకోవాలి….
Health tips : జీవనశైలి విధానంలో హై బీపీ అనే సమస్య రోజురోజుకి ఎక్కువైపోతుంది. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య వయసు తరహా లేకుండా ప్రతి ఒక్కరికి చుట్టూ ముడుతుంది. హైబీపీ ఏ వయసు వారికైనా వస్తుంది. వృద్ధాప్యంలో ఈ అధిక రక్త పోటు సమస్య ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంది. ఈ రక్తపోటును నియంత్రించడానికి ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అయితే బ్లడ్ ప్రెజర్ ని నీళ్లతో కూడా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.అయితే ఈ నీరు నిత్యం ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం…
సరియైన మోతాదులో నీటిని తీసుకోవడం అవసరం:గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన మోతాదులో నీటిని తీసుకోవాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.. మెగ్నీషియం, క్యాల్షియం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల హై బీపీ కంట్రోల్ లో ఉంటుందని ఓ పరిశోధనలో వెలువడింది. మెగ్నీషియం, విటమిన్లు కోసం మీరు దోసకాయ, నిమ్మకాయ, పుదీనా, జామున్ కలిపిన నీటిని త్రాగవచ్చు.వెరీ వెల్ హెల్త్ తెలిపిన విధంగా ఆడవారు నిత్యము 2.7 లీటర్ల నీటిని తీసుకోవాలి. అదే టైంలో మగవారు రోజుకి 3.7 లీటర్ల నీటిని తీసుకోవాలి. కొన్ని కూరగాయలు, ఫ్రూట్స్ లలో నీటి పరిమాణం ఉంటుంది. దాని వలన మన శరీరం హైడ్రెడ్ గా ఉంటుంది. అలాగే హైబీపీ కూడా తగ్గిపోతుంది.

Does water reduce high blood pressure, how many liters of water should be taken daily
హైడ్రేటుగా ఉండడం కూడా చాలా అవసరం…
మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవడానికి హైడ్రేట్ గా ఉండడం చాలా అవసరం అని వైద్య నిపుణులు చెప్తున్నారు. డిహైడ్రేషన్ ఐబీపీకి మధ్య సంబంధం ఉంది. సరియైన మోతాదులో నీటిని తీసుకుంటే మన శరీరం హైడ్రేటుగా ఉంటుంది. అదే టైంలో డిహైడ్రేషన్ విషయంలో మన గుండె పంపింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడాలి.