TEA : టీ తాగిన తర్వాత ఇవి తినొద్దు.. ఎందుకంటే..??
TEA : ఛాయ్.. చాలా మంది జీవితాల్లో భాగమై పోయింది. ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగి తేనే రోజు ప్రారంభం అవుతుంది. కొంత మంది పొద్దున్నే టీ తాగుతుంటారు. ఛాయ్ తాగనిదే రోజు గడవదు అంటారు. టీ తాగితే అలసట, ఒత్తిడి మటుమాయం అవుతుందని చెబుతారు చాలా మంది. నిద్ర లేవ గానే ఛాయ్ తాగడం వల్ల రీఫ్రెష్ అయ్యామని అనుకుంటారు చాలా మంది. కొందరైతే.. టీ అంటే పడి చస్తారు. ఒకటికి రెండు కప్పుల ఛాయ్ తాగేస్తారు. ఉదయం లేవగానే ఒక కప్పు టీ.. తర్వాత టిఫిన్ చేసిన తర్వాత మరో కప్పు.. ఇలా రోజుకు 4 కంటే ఎక్కువ సార్లే టీ తాగుతారు చాలా మంది. ఒత్తిడి ఉండే ఉద్యోగం చేసే వాళ్లు అయితే..
ఆ సంఖ్య మరింత పెరుగుతుంది అనడంలో ఏ సందేహం లేదు. టీ తాగడం వల్ల ఒత్తిడి దూరం అవుతుందని వీళ్లంతా అనుకుంటారు.కానీ.. లేవ గానే టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్యులు. ఖాళీ కడుపుతో ఛాయ్ కాకుండా… మంచి నీళ్లు తాగితే మంచిదట. కాఫీ లేదా ఛాయ్ తాగడం వల్ల ఛాతిలో మంట, డీ హైడ్రేషన్, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి.రుచితో పాటు, మనకు రోజూ అవసరమైన ఆహారం నుండి పోషకాలు లభిస్తాయి. కానీ కొన్ని ఆహార పదార్థాల విటమిన్లు, ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ప్రోటీన్ అధికంగా ఉండే వాటిని తిన్న తర్వాత టీ అస్సలే తాగకూడదని అంటారు వైద్యులు.
టీలో ఉండే టానిన్లు, గ్రీన్ టీలో క్యాటెచిన్స్, ఫ్లేవనాయిడ్స్… ప్రోటీన్, ఐరన్ శోషణను నిరోధిస్తుందని… అందుకే ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఛాయ్ తాగకూడదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.అలాగే పచ్చి కూరగాయలు తిన్న తర్వాత కూడా టీ తాగడం మానేయ్యాలని అంటున్నారు నిపుణులు. ఆకు కూరల్లో ఉండే గోయిట్రోజెన్‌లు థైరాయిడ్ గ్రంథి ద్వారా అయోడిన్ శోషణను నిరోధించి అయోడిన్ లోపానికి కారణం అవుతాయి అందుకే ఆకుకూరలు తిన్న తర్వాత టీ తాగొద్దని చెబుతున్నారు.