Cardamom : యాలకులను తీసుకుంటే క్యాన్సర్ తో పాటు ఎన్నో రకాల వ్యాధులు పరార్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Cardamom : యాలకులను తీసుకుంటే క్యాన్సర్ తో పాటు ఎన్నో రకాల వ్యాధులు పరార్…?

Cardamom : మనం స్వీట్లు మరియు టీ లాంటి వాటిలలో రుచికోసం యాలకులను ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే భోజనం చేసిన తర్వాత కూడా మౌత్ ఫ్రెష్ నర్ లా కూడా యాలకులను ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే వీటి వలన ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యాలకులు జీర్ణవ్యవస్థను బలంగా చేసేందుకు ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ యాలకులు నమలడం వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి గ్యాస్ మరియు […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 October 2024,11:00 am

Cardamom : మనం స్వీట్లు మరియు టీ లాంటి వాటిలలో రుచికోసం యాలకులను ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే భోజనం చేసిన తర్వాత కూడా మౌత్ ఫ్రెష్ నర్ లా కూడా యాలకులను ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే వీటి వలన ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యాలకులు జీర్ణవ్యవస్థను బలంగా చేసేందుకు ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ యాలకులు నమలడం వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి గ్యాస్ మరియు ఉబ్బరం అనేది తగ్గుతుంది. అలాగే యాలకులు ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. కావున ఇది శరీరంలో రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే యాలకులను నమిలి తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్లో ఉంటాయి.

అలాగే ఈ యాలకులు మన మనస్సు మరియు శరీరాన్ని కూడా ఎంతో సంతోషంగా ఉంచుతాయి… యాలకులను తీసుకోవడం వలన ఆందోళన మరియు డిప్రెషన్ నుండి కూడా బయటపడవచ్చు. అయితే యాలకులను నీటిలో వేసి మరిగించి తీసుకుంటే చాలా మంచిది. దీని వలన మానసిక ఆరోగ్యాన్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అంతేకాక యాలకులలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుండి కూడా చర్మాన్ని కాపాడటంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాక శరీరంలో టాక్సిన్స్ ను తొలగించి చర్మానికి ఎంతో మెరుపుని ఇస్తుంది. అయితే వర్షాకాలంలో దగ్గు మరియు ముక్కు కారటం, గొంతు నొప్పితో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

అయితే దీనికి యాలకుల టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది… యాలకుల లో యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎన్నో రకాల గొంతుకు సంబంధించిన సమస్యలను దూరం చేయటంలో కూడా హెల్ప్ చేస్తాయి. అంతేకాక ఆస్తమా మరియు బ్రాంకైటిస్ లాంటి శ్వాసకోశ సమస్యల నుండి కూడా ఉపసమనాన్ని కలిగిస్తుంది. అలాగే పీరియడ్స్ టైం లో వచ్చే కడుపునొప్పి మరియు కండరాల తిమ్మిర్లతో ఇబ్బంది పడే వారికి కూడా యాలకుల నీరు ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ యాలకుల నీటిలో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యత నుండి కూడా ఉపసమనాన్ని కలిగిస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది