Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ తప్పులు మాని, ఈ అలవాట్లు పాటించండి!
ప్రధానాంశాలు:
Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ తప్పులు మాని, ఈ అలవాట్లు పాటించండి!
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న కారణాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా చాలా మందిని ఇది ప్రభావితం చేస్తోంది. ఫ్యాటీ లివర్ అంటే ..కాలేయంలో అనవసరంగా కొవ్వు కణాలు పేరుకుపోవడం వల్ల వచ్చే సమస్యే ఫ్యాటీ లివర్.

Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ తప్పులు మాని, ఈ అలవాట్లు పాటించండి!
Fatty Liver : ఏంటి ఫ్యాటీ లివర్ అంటే..
ఇది ప్రారంభ దశలో నిర్లక్ష్యం చేస్తే, లివర్ సిర్రోసిస్, టైప్ 2 డయాబెటిస్, హార్ట్ డిసీజ్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ఫ్యాటీ లివర్ నుంచి బయటపడాలంటే బరువు తగ్గడం మొదటి అడుగు.
ఊబకాయం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు, ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణం. వారానికి కనీసం 5 రోజులైనా నడక, యోగా, సైక్లింగ్ వంటి శారీరక శ్రమ వహించాలి.మరిగించిన పండ్ల రసాలు, బేకరీ ఐటెమ్స్, తీపి పానీయాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. బదులుగా తాజా కూరగాయలు, ఇంటి భోజనం, తృణధాన్యాలు తీసుకోండి.
పసుపులోని కుర్కుమిన్ వలన లివర్ వాపు తగ్గుతుంది. వేడి నీటిలో చిటికెడు పసుపు కలిపి తాగడం మంచిది. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొవ్వు ద్రవీకరణకు సహాయపడతాయి. నెయ్యి, వెన్న, ఎర్ర మాంసం, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లివర్ మీద ఒత్తిడి పెడతాయి. బదులుగా అవకాడో, గింజలు, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవాలి. ఉసిరి కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. తిప్పతీగ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి సహజ ఔషధాల్లా పనిచేస్తాయి. పొడి రూపంలో తీసుకోవచ్చు లేదా కషాయంగా ఉపయోగించవచ్చు