Hair Tips : మీ జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా.? అయితే ఇలా ట్రై చేసి చూడండి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : మీ జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా.? అయితే ఇలా ట్రై చేసి చూడండి..!!

Hair Tips : ప్రస్తుతం ఉన్న కాలంలో జుట్టు రాలే సమస్యలు చాలామందిలోనూ కనిపిస్తూ ఉన్నాయి. వయసు తరహా లేకుండా ఈ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. కొన్ని సమయాలలో జుట్టు రాలే సమస్య యుక్త వయసులోనే కనిపించవచ్చు. ఏ వయసు వారికైనా జుట్టు రాలే సమస్య ప్రారంభమయ్యాక ఆ సమస్య నుండి ఎలా బయటపడాలా అని ఆందోళన వారి మెదడును తినేస్తూ ఉంటుంది. అయితే జుట్టు రాలడం మొదలయ్యాక చాలామంది డాక్టర్స్ ను సంప్రదిస్తూ ఉంటారు. ఇంకొందరైతే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :22 February 2023,3:00 pm

Hair Tips : ప్రస్తుతం ఉన్న కాలంలో జుట్టు రాలే సమస్యలు చాలామందిలోనూ కనిపిస్తూ ఉన్నాయి. వయసు తరహా లేకుండా ఈ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. కొన్ని సమయాలలో జుట్టు రాలే సమస్య యుక్త వయసులోనే కనిపించవచ్చు. ఏ వయసు వారికైనా జుట్టు రాలే సమస్య ప్రారంభమయ్యాక ఆ సమస్య నుండి ఎలా బయటపడాలా అని ఆందోళన వారి మెదడును తినేస్తూ ఉంటుంది. అయితే జుట్టు రాలడం మొదలయ్యాక చాలామంది డాక్టర్స్ ను సంప్రదిస్తూ ఉంటారు. ఇంకొందరైతే ఇంట్లో కొన్ని చిట్కాలను ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు కొన్ని చిట్కాలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… గ్రీన్ టీ : గ్రీన్ టీ లో ఎక్కువ మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు పెరగడానికి కూడా అంతగానే సహాయపడుతుంది.

Hair Tips Are you suffering from Hair loss

Hair Tips Are you suffering from Hair loss

గ్రీన్ టీ చల్లారబెట్టిన తర్వాత ఆ టీ మిశ్రమాన్ని మాడు రాసుకోవాలి. ఒక గంట పాటు దానిని వదిలేసి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఉల్లిపాయ రసం : ఉల్లిపాయలు తయారుచేసిన ఈ జ్యూస్ ను మాడికి అప్లై చేయడం వలన జుట్టు రాలడం ఆగిపోయి మళ్లీ జుట్టు పెరగడం మొదలవుతుంది. దానికి కారణం ఉల్లిపాయలు ఉండే సల్ఫర్ మూలకాలే ఉల్లిపాయ జ్యూస్ 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత తక్కువగాడుతున్న షాంపులతో శుభ్రం చేసుకోవాలి.. కలమంద : కలమందలో ఉండే సుగుణాలు అన్ని ఇన్ని కావు వెయిట్ లాస్ నుంచి మొదలుకొని మెరిసే చర్మం వరకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు ఊడిపోతున్నందుకు బాధపడుతున్న వాళ్లకి ఈ కలమంద చాలా బాగా ఉపశమనాన్ని అందిస్తుంది. వెంటనే తలమాడుపై అప్లై చేయాలి.

How To Get Long & Thick Hair, Stop Hair Fall & Get Faster Hair Growth In 2  Weeks - YouTube

అలా 30 నిమిషాల పాటు ఉంచిన తర్వాత యుకెన్ వాటర్ తో కడిగేయాలి. కలబంద వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు మళ్ళీ పెరుగుతుంది. కోడిగుడ్డు మాస్క్ : కోడిగుడ్లు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే జుట్టు పెరగడానికి ప్రోటీన్ సహాయపడుతుంది. ప్రోటీన్ కూడా జుట్టు పెరగడానికి సహాయపడుతుందట. కోడిగుడ్డును పగల కొట్టి ఒక మిశ్రమంగా తయారు చేసి తలకి అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో షాంపూ చేయాలి.. కోకోనట్ ఆయిల్ : జుట్టుకి మాడుకు కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు బ్రేక్ అవ్వడం తగ్గడమే కాకుండా జుట్టు బలంగా తయారవుతుంది. ప్రధానంగా గోరువెచ్చగా కాసిన కొబ్బరి నూనె తలకి అప్లై చేసి కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి. రాత్రివేళ అప్లై చేసి మర్నాడు ఉదయం షాంపుతో తల స్నానం చేయాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది