Hair Tips : వీటిని ఎక్కువగా తీసుకుంటే బట్టతలతో బాధపడతారు… అందుకే దూరం పెట్టాలి…
Hair Tips : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య ఎక్కువైపోయింది. జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతే జాగ్రత్త పడాల్సిందే. అశ్రద్ధ వహిస్తే జుట్టు మొత్తము రాలిపోయి బట్టతల బారిన పడే అవకాశం ఉంది. జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం జీవన శైలిలో వచ్చిన మార్పులు తినే ఆహారంలో పోషకాల లోపం, పెరుగుతున్న కాలుష్యం, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ ఇలా ఎన్నో కారణాల వలన జుట్టు రాలిపోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా పోషకాలు లేని ఆహారం తినడం వలన జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. శరీరంలో విటమిన్ సి, డి, ప్రోటీన్స్, క్యాల్షియం స్థాయిలు తగ్గిపోతే జుట్టు వేగంగా రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు పోషణకు ప్రోటీన్ చాలా ముఖ్యం. ప్రోటీన్స్ లేకపోవడం వలన జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అయితే కొన్ని ఫుడ్స్ తరచూ తీసుకోవడం వలన జుట్టు రాలుతుంది.
జుట్టు రాలిపోవడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. వీటికి కనుక దూరంగా ఉన్నారంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మన శరీరానికి హాని కలుగుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం చక్కెరను ఎక్కువగా తీసుకుంటే అది బట్టతల కి కారణం కావచ్చు. నిజానికి చక్కెర తినడం వలన ఇన్సులిన్ నిరోధకత సమస్య వస్తుంది. ఇది క్రమంగా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చక్కెర వంటి అధిక గ్లైసేమిక్ ఆహారాలు హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ కు కారణం అవుతాయి. కాబట్టి ఇలాంటి ఫుడ్స్ కు దూరంగా ఉంటే మంచిది. అలాగే చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ వంటి ముఖ్యమైన పోషకాలు మనకు లభిస్తాయి. అయితే జుట్టు రాలడం సమస్య ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు.
ప్రస్తుతం దొరికే చేపల్లో పాదరసం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి అనేక విధాలుగా హానిచేస్తుంది. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కనుక చేపలను పరిమితి వరకు తీసుకోవడం మంచిది. అలాగే బయట ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వలన జుట్టు రాలిపోతుంది. జంక్ ఫుడ్స్ మంచి రుచిని కలిగి ఉంటాయి. అయితే వీటిని తినడం అలవాటు చేసుకుంటే మాత్రం లేనిపోని రోగాలను తెచ్చుకున్నట్లే. జంక్ ఫుడ్స్ లో అజినో మోటో, సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరం, జుట్టుకు హాని తలపెడతాయి. జంక్ ఫుడ్స్ వల్ల శరీరంలో ఇది రక్తప్రసరణను తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు తలమాడుకు సరైన రక్త ప్రసరణ జరగక జుట్టు రాలిపోవడం జరుగుతుంది.కనుక ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం మంచిది.