Hair Tips : తలలో పేలు పోవాలంటే… నూనెలో ఈ ఒక్కటి కలసి రాస్తే చాలు…
Hair Tips : ప్రస్తుతం చాలామంది జుట్టు రాలడం, తలలో పేలు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి రకరకాల షాంపులు, ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ను ఉపయోగిస్తున్నారు. వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులువుగా ఈ చిట్కాలను ఉపయోగించి తలలో పేలు, చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా జుట్టుకు సరిపడా కొబ్బరినూనెను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో మూడు కర్పూరం బిళ్ళలను వేసి మెత్తగా పొడి చేసి వేసి బాగా కలుపుకోవాలి. ఈ నూనెను తలకు అప్లై చేసుకోవాలి. మూడు గంటలపాటు ఆరనిచ్చి తర్వాత ఏదైనా షాంపుతో తలస్నానం చేయాలి.
ఈ నూనె వాసనకు ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నవారు ప్రతిరోజు వాడవచ్చు. ఇలా తయారు చేసుకున్న నూనెను వారానికి ఒకసారి జుట్టుకు అప్లై చేసినట్లయితే తలలో ఉండే పేలు, చుండ్రు, ఇన్ఫెక్షన్ తగ్గిపోతాయి. అలాగే తలలో వచ్చే చిన్న చిన్న పొక్కులు కూడా తగ్గిపోతాయి. చుండ్రు ఉంటే జుట్టు పెరగదు. అలాంటప్పుడు ఈ నూనె రాస్తే చుండ్రు కూడా తగ్గిపోతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే మరొక చిట్కా ఏంటంటే మెంతులను నానబెట్టి పేస్ట్ చేసి అందులో కూడా కర్పూరం బిళ్ళలు వేసి తలకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత రెండు మూడు గంటలు ఆరనివ్వాలి. తర్వాత తల స్నానం చేస్తే తలలో ఉండే పేలు, చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ ప్యాక్ ను కూడా వారానికి ఒకసారి అప్లై చేయాలి.
మూడవ చిట్కా రెండు లేదా మూడు చెంచాల కొబ్బరి నూనెలో ఒక స్పూన్ వేప నూనె వేసి బాగా కలిపి తలకు రాసుకోవాలి. రెండు మూడు గంటలసేపు ఆరనిచ్చి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన తలలో పేలు,చుండ్రు, ఇన్ఫెక్షన్స్, కురుపులు వంటి సమస్యలు తగ్గిపోతాయి. వేపాకులు దొరుకుతాయి అనుకున్న వారు ఆకులను పేస్ట్ చేసి తలకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వేప నూనె వేపాకులు దొరకనివారు మార్కెట్లో రెడీమేడ్ వేపాకు దొరుకుతుంది. దాన్ని పుల్లటి పెరుగులో కలిపి తలకు అప్లై చేసి రెండు లేదా మూడు గంటలసేపు ఆరనివ్వాలి. తర్వాత తల స్నానం చేయడం వలన చుండ్రు, పేలు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గిపోతాయి. అయితే ఈ మూడు చిట్కాలను ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏది చేయాలనిపిస్తే ఆ చిట్కాను ట్రై చేయవచ్చు.