Hair Tips : రాత్రికి రాత్రే జుట్టు రాలే సమస్యను తగ్గించే హెయిర్ సీరం గురించి తెలుసా?
Hair Tips : మీ జుట్టును నల్లగా, పొడవుగా, దృఢంగా తయారు చేసే హెయిర్ సీరం ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఈ హెయిర్ సీరంను ఉపయోగించడం వల్ల మీ జుట్టు చాలా ఒత్తుగా అవుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. హెయిర్ ఫఆల్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మన చెడు ఆహారపు అలవాట్లు మరియు పెరుగుతున్న వాతావరణ కాలుష్యాల వల్లే జుట్టు చాలా వరకు నాశనం అవుతుంది. అలాగే డాండ్రఫ్ వంటి సమస్యను కూడా క్షణాల్లో తగ్గిస్తుంది. ప్రస్తుత కాలంలో దాదాపు పది మందిలో ఎనిమిది మందికి పైగా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు.
అయితే దీన్ని తగ్గించుకునేందుకు మీరు ఈ అద్భుతమైన చిట్కాను పాటించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మూడు స్పూన్ల మెంతులను ఒక గిన్నెలో తీసుకొని ఒఖ గ్లాస్ వాటర్ తో ముందు రోజు రాత్రి నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల మెంతుల్లోని పోషకాలు అన్నీ నీటిలోకి దిగుతాయి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు మరియు ఉల్లిపాయలు ఒక మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన మిశ్రమాన్ని వడకట్టు లేదా గుడ్డ సాయంతో వడకట్టుకొని ఆ రసాన్ని తీసుకోవాలి. ఈ రసంలను మూడు స్పూన్ల మెంతులు నానబెట్టిన నీటిలో వేసుకొని కలుపుకోవాలి.

Hair Tips how to make your hair grow super fast overnight
దీనికి ముందుగా మెంతులు కలిపిన నీటిని వడకట్టుకోవాలి. ఈ రెండింటిని రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపాలి. ఇలా తయారైన సీరంను డ్రై హెయిర్ కు ముందు రోజు రాత్రి అప్లై చేసుకోవాలి. తర్వాత రోజు ఉదయం ఏదైనా మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మనం హెయిల్ ఫాల్ నుండి విడుదల పొందవచ్చు.అలాగే హెయిర్ గ్రోత్ కూడా రెండింతలు అవుతుంది. వెల్లులిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, విటామిన్ బి6 హెయిర్ గ్రోత్ కి బాగా ఉపయోగపడుతుంద. అలాగే ఉల్లిపాయ వల్ల కూడా సల్ఫర్ వంటివి అంది జుట్టు దృఢంగా అవుతుంది. అలాగే మెంతుల్లో ఉండే విటామిన్ కె, డి1, డి12, సి లు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.