Hair Tips : బీట్రూట్ తో బట్టతల సమస్యకి ఇంట్లోనే హెయిర్ ప్యాక్ ఇలా ట్రై చేయండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : బీట్రూట్ తో బట్టతల సమస్యకి ఇంట్లోనే హెయిర్ ప్యాక్ ఇలా ట్రై చేయండి…!

Hair Tips : ప్రతి ఒక్కరిలోనూ జుట్టు సమస్య రోజుకి ఎక్కువ అవుతున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే దీనికోసం ఎన్నో వేల ఖర్చులు చేస్తూ ఎన్నో క్రీమ్ లు, షాంపులను ఆయిల్సి వాడిన కానీ ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. అటువంటి వారికి బీట్రూట్ చిట్కాతో మీ ముందుకు రావడం జరిగింది. బీట్రూట్ అంటే ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బీట్రూట్ మనిషి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడింది. బీట్రూట్ ఆరోగ్యానికి కాకుండా జుట్టు కూడా చాలా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 November 2022,7:30 am

Hair Tips : ప్రతి ఒక్కరిలోనూ జుట్టు సమస్య రోజుకి ఎక్కువ అవుతున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే దీనికోసం ఎన్నో వేల ఖర్చులు చేస్తూ ఎన్నో క్రీమ్ లు, షాంపులను ఆయిల్సి వాడిన కానీ ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. అటువంటి వారికి బీట్రూట్ చిట్కాతో మీ ముందుకు రావడం జరిగింది. బీట్రూట్ అంటే ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బీట్రూట్ మనిషి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడింది. బీట్రూట్ ఆరోగ్యానికి కాకుండా జుట్టు కూడా చాలా సహాయపడుతుంది. జుట్టుని అందంగా చేయడంలో బీట్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇది సాధారణమైనది దీనివలన ఎలాంటి చెడు ప్రభావాలు కలగవు.. మీరు కూడా బట్టతల సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ బీట్రూట్ జ్యూస్ ను వినియోగించవచ్చు.

బీట్రూట్ హెయిర్ ప్యాక్ ఉపయోగించవచ్చని తెలియజేస్తున్నారు నిపుణులు. అయితే బీట్రూట్ ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో దీనివలన ఉపయోగాలు ఏంటో ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాం… హెయిర్ ప్యాక్ కోసం… అల్లం రసం 2 టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, దుంప రసం కప్పు. హెయిర్ ప్యాక్ తయారు చేయడం ఎలా.? ముందుగా ఒక గిన్నె తీసుకొని దాన్లో ఒక అరకప్పు బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. దానికి రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసాన్ని కలుపుకోవాలి. తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంతే బీట్రూట్ హెయిర్ ప్యాక్ సిద్ధం. ఎలా అప్లై చేసుకోవాలి.. బీట్రూట్ హెయిర్ ప్యాక్ ని స్కాల్ప్ పై అలాగే జుట్టుకి కొద్దికొద్దిగా రాసుకోవాలి.

Hair Tips on Beetroot Hair Pack

Hair Tips on Beetroot Hair Pack

ఆ తదుపరి తలపై స్మూత్ గా మసాజ్ చేయించుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ ని 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత జుట్టుని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఈ ప్యాక్ ని వారానికి రెండు సార్లు వాడుకోవచ్చు.. బట్టతల సమస్య నుండి బయటపడవచ్చు… బీట్రూట్ హెయిర్ ప్యాక్ సర్వసాధారణమై నది దీన్ని వాడడం వలన జుట్టు తలపై ఎటువంటి చెడు ప్రభావాలు కలగవు. దీనిని అప్లై చేసుకోవడం వలన జుట్టు సమస్యలు అన్ని తగ్గిపోతాయి. అని వైద్య నిపుణులు తెలియజేయడం జరిగింది.
బట్టతల సమస్యను నుంచి ఉపశమనం… బీట్రూట్ హెయిర్ ప్యాక్ సహాయంతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా జుట్టుకి బలాన్ని కూడా కలిగిస్తుంది. బీట్రూట్ తో తయారు చేసిన హెయిర్ ప్యాక్ ని ఎవరైనా వాడుకోవచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది