Hair Tips : మీరు చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.? అయితే ఈ చిట్కాలను వాడి చూడండి..!
Hair Tips : ఈ చలికాలంలో చాలామందిలో చుండ్రు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చుండ్రు చలికాలంలో అధికమవుతూ ఉంటుంది. దీని వలన రోజు జుట్టులో జిడ్డు పేరుకుపోవడం, దురదలు లాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి సమస్యలకి కొన్ని చిట్కాలను వాడితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అని వైద్య నిపుణులు తెలియజేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…
1) బృంగరాజ్ పొడి : ఈ బృంగ్రాజ్ పౌడర్ రెండు చెంచాలు తీసుకుని దానిలో ఆముదం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకి బాగా అప్లై చేసి ఏదైనా కవర్ ని పెట్టుకోవాలి. ఇలా ఒక గంటన్నర తర్వాత గాడ్త తక్కువ గల షాంపుని వాడి గోరువెచ్చని నీటితో జుట్టుని శుభ్రం చేసుకోవాలి.
కొబ్బరి నూనె :ఈ కొబ్బరి నూనె తలకి పెట్టుకోవడం వలన ఈ నూనెలో యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఉండే ఈ నూనె చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా జుట్టుకి ఉన్న పొడిదనాన్ని కూడా తగ్గిస్తుంది.
బేకింగ్ సోడా : ఈ వంట సోడాలు యాంటీ పంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ షోడా మృతుకనాలను తొలగించడమే కాకుండా దురదను కూడా తగ్గిస్తుంది. అరకప్పు పెరుగులో టీ స్పూన్ వంట సోడా ని కలుపుకొని ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి మసాజ్ చేసుకోవాలి. తర్వాత 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి.
అలోవెరా : స్కిన్ ఆయింట్మెంట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో వాడే ఓ ప్రధానమైన పదార్థం కలమంద ఇది సాధారణంగా ఇంటి చిట్కాగా సహాయపడుతుంది. దీని వలన ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. సోరియాసిస్, కాలిన గాయాలు లాంటి సమస్యలను అరికట్టడమే కాకుండా యాంటీ బ్యాక్టీరియాల్ గుణంతో చుండ్రికి చెక్ పెట్టవచ్చు…
ఉల్లిపాయ : ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు చెంచాల మెంతులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఒక ఉల్లిపాయను తీసుకొని తొక్క తీసేసి చిన్న ముక్కలక చేసుకొని ఇప్పుడు బ్లెండర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులు వాటర్ తో సహా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకి అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి.