Hair Tips : చలికాలం వేడి నీళ్లు తో తలస్నానం చేయడం వలన జుట్టు సమస్యలు వస్తాయా.? ఈ మూడు టిప్స్ తో దానికి చెక్ పెట్టవచ్చు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : చలికాలం వేడి నీళ్లు తో తలస్నానం చేయడం వలన జుట్టు సమస్యలు వస్తాయా.? ఈ మూడు టిప్స్ తో దానికి చెక్ పెట్టవచ్చు…!

Hair Tips : చాలామంది చలికాలంలో తలస్నానాలు చేసేటప్పుడు వేడి నీళ్లని వాడుతూ ఉంటారు. ఆ విధంగా వేడి నీళ్లు వాడడం వలన జుట్టు సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. చలికాలంలో వేడి నీళ్ల తో తల స్నానం చేయడం వలన జుట్టు పొడిబారి పోవడంతో పాటు బలహీనంగా తయారవుతూ ఉంటుంది. ఈ విధంగా అశ్రద్ధ చేస్తే బట్ట తలకి దారి తీసే అవకాశం ఉంటుంది. చల్లని వాతావరణం ఆరోగ్యానికి చెడు చేయడమే కాకుండా జుట్టును కూడా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 November 2022,4:40 pm

Hair Tips : చాలామంది చలికాలంలో తలస్నానాలు చేసేటప్పుడు వేడి నీళ్లని వాడుతూ ఉంటారు. ఆ విధంగా వేడి నీళ్లు వాడడం వలన జుట్టు సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. చలికాలంలో వేడి నీళ్ల తో తల స్నానం చేయడం వలన జుట్టు పొడిబారి పోవడంతో పాటు బలహీనంగా తయారవుతూ ఉంటుంది. ఈ విధంగా అశ్రద్ధ చేస్తే బట్ట తలకి దారి తీసే అవకాశం ఉంటుంది. చల్లని వాతావరణం ఆరోగ్యానికి చెడు చేయడమే కాకుండా జుట్టును కూడా సమస్యలు వచ్చేలా చేస్తుంది. ఈ చలికాలంలో జుట్టుని వేడి నీళ్లతో క్లీన్ చేయడం వలన పొడిబారి బలహీనంగా మారుతుంది. జుట్టు పొడి వారడం వలన జుట్టు బలహీనమవుతుంది. దీనికి మూలంగా జుట్టు తొందరగా చిట్లిపోతూ ఉంటుంది. పొడి వాతావరణం చల్లగాలి జుట్టు పొడిబారి పోతూ ఉంటుంది. డ్రై హెయిర్ డ్రై ఫ్రిడ్జ్ గా మారి త్వరగా చిట్లి పోతూ ఉంటుంది. అటువంటి జుట్టు సమస్య కూడా వస్తూ ఉంటుంది.

వింటర్ సీజన్లో జుట్టు సంరక్షణ చాలా ప్రధానం ఈ చలికాలంలో జుట్టు సంరక్షణ కోసం ఆడవాళ్లు ఎన్నో రకాల సౌందర్య ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. ఇవి కొన్నిసార్లు జుట్టుపై చెడు ప్రభావాలను కలిగిస్తూ ఉంటాయి. చలికాలంలో జుట్టు సంరక్షణ కోసం ఇంటి నివారణను వినియోగించడం చాలా ప్రభావితంగా ఉంటుంది. జుట్టు పొడిబారడాన్ని తగ్గించుకోవడానికి అనుసరించే చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… అలోవెరా అప్లై చేసుకోండి… వింటర్ సీజన్ లో జుట్టు పొడిబారకుండా ఉండడం కోసం అలోవెరా జెల్ జుట్టుకు అప్లై చేయాలి. ఔషధ గుణాలు అధికంగా ఉన్న కలమంద జల్ జుట్టుపొడి వారకుండా చేస్తుంది. చుట్టూ ఆరోగ్యవంతంగా చేస్తుంది. కలమందలో మార్చరేజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవి జుట్టుని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలోవెరా జెల్ అప్లై చేసుకోవడానికి ఒక బౌల్లో కలమంద గుజ్జును తీసి బ్రష్ తో జుట్టు మొత్తం పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత జుట్టుని నీటితో కడగాలి. కలమంద జుట్టుకు పోషణను కలిగిస్తుంది. జుట్టు పొడిబారకుండా చేస్తుంది.

Hair Tips on You can check it with these three tips

Hair Tips on You can check it with these three tips

గుడ్డుని వినియోగించి… జుట్టుకు కోడిగుడ్లను వాడడం వలన జుట్టుకు తగినంత సంరక్షణ కలుగుతుంది. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్డు జుట్టుపై కరాటే ట్రీట్మెంట్ గా ఉపయోగపడుతుంది. కోడి గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. జుట్టుకి గుడ్డును ఉపయోగించాలంటే ఒక గిన్నెలో గుడ్డుని తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల వరకు జుట్టుకి అప్లై చేసి ఆ తదుపరి షాంపుతో తలస్నానం చేయాలి. గుడ్డును ఇలా పట్టించిన తర్వాత జుట్టు పొడి మారడం ఆగిపోయి జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది.

పెరుగుతూ జుట్టు పొడిబారడాన్ని తగ్గించుకోవచ్చు.. పెరుగు తీసుకోవడం జుట్టుకి చాలా మేలు జరుగుతుందో అలాగే ఆరోగ్యానికి కూడా అంతే మేలు జరుగుతుంది. పెరుగు తీసుకోవడం వలన శరీరం హైడ్రేట్ గా ఉండేలా.. వెంట్రుకలు పెరుగుని ఉపయోగించడం వలన జుట్టు కూడా హైడ్రేట్ గా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉండే పెరుగు చలికాలంలో జుట్టుకి మంచి మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకి వాడడం వలన జుట్టుకు పోషణ కలుగుతుంది. ఒక గిన్నెలో పెరుగు తీసుకొని బ్రష్ సహాయంతో జుట్టు తలకు అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత 15 నిమిషాల వరకు ఉంచి తర్వాత జుట్టును కడిగేస్తే ఈ పొడి బారే సమస్య తగ్గిపోతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది