Hair Tips : ఈ కొత్త చిట్కాతో మీ జుట్టు పొడవుగా, నల్లగా నిగనిగలాడుతుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : ఈ కొత్త చిట్కాతో మీ జుట్టు పొడవుగా, నల్లగా నిగనిగలాడుతుంది…

 Authored By anusha | The Telugu News | Updated on :6 July 2022,3:00 pm

Hair Tips : చాలామంది జుట్టు నల్లగా, పొడవుగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం వివిధ రకాల చిట్కాలను అనుసరిస్తూ ఉంటారు. అయినా జుట్టు లో ఎటువంటి మార్పు రాదు. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో పోషకాహార లోపం వలన అలాగే వాతావరణ కాలుష్యం వలన ఇలా అనేక కారణాల వలన జుట్టు రాలే సమస్య అందరిని బాధపెడుతుంది. అలాగే ఎక్కువగా రసాయనాలతో చేసిన హెయిర్ ఆయిల్స్ ను వాడటం వలన కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. ఇలా కాకుండా మన ఆయుర్వేద పద్ధతిలో జుట్టు పెరగడం కోసం కొన్ని చిట్కాలను అనుసరించామంటే తప్పనిసరిగా జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది. ప్రకృతిలో దొరికే పదార్థాలతో జుట్టు నల్లగా, పొడవుగా పెరిగేలా చేసామంటే మనకు ఆరోగ్యపరంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. జుట్టుకు ఎటువంటి హాని కలగకుండా కురులు పొడవుగా, నల్లగా నిగనిగలాడాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ప్రతిరోజు అన్నంను వండుకుంటాం. తినగా మిగిలిన అన్నాన్ని పడేస్తుంటాం. కానీ అన్నంతో జుట్టు సమస్యలను సులువుగా తగ్గించుకోవచ్చు. జుట్టు నల్లగా, పొడవుగా పెరగడానికి అన్నం ఎంతో సహాయపడుతుంది. అన్నంలో ఉండే జిగురుతో మన జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అన్నంతో జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. వివిధ రకాల రసాయనాలతో తయారైన హెయిర్ ఆయిల్స్ ను వాడే బదులు మనకు రోజు ఇంట్లో దొరికే అన్నంతో సులువుగా జుట్టును ఒత్తుగా, పొడవుగా చేసుకోవచ్చు. ఈ అన్నంతో మనకు ఆరోగ్యపరంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. అలాగే ఈ అన్నంతో సులువుగా జుట్టుకోసం చిట్కాను తయారు చేసుకోవచ్చు. కనుక ఎప్పుడైనా సరే మీ ఇంట్లో మిగిలిన అన్నం పడేయకండి. ఇలా జుట్టు కోసం చిట్కాను తయారు చేసుకోండి. అయితే ఇప్పుడు అన్నంతో చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

Hair Tips use these paste your hair grow long

Hair Tips use these paste your hair grow long

ముందుగా మన ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని తీసుకొని దానిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న అన్నం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులోకి ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తల మాడ నుంచి కురులు చివర్ల దాకా బాగా పట్టించాలి. ఒక అరగంటసేపు ఆరనివ్వాలి. తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మీకు జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు పొడవుగా, నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో జుట్టూ సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. అలాగే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ఎంతో సమయం కూడా పట్టదు. కనుక జుట్టు సమస్యలతో బాధపడేవారు ఈ చిట్కాను కనుక అనుసరించినట్లయితే మీ జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది