Hair Tips : మీరు తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా.? ఈ చిట్కా ట్రై చేసి చూడండి.. ఒకసారి కే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది…!
Hair Tips : ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఉద్యోగరీత్యా, వాతావరణం వలన చాలామందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. ఈ సమస్య మనం మగవారిలో కూడా చూస్తున్నాం. వయసు తరహా లేకుండా అన్ని వయసు గల వారికి ఈ సమస్యతో బాధపడుతున్నారు. మరి చిన్నవయసులో తెల్ల జుట్టు రావడం వలన వాళ్ళు పదిమందిలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. దానికోసం వాటిని కనపడకుండా చేయడం కోసం ఎన్నో కలర్స్ ప్రోడక్ట్ ను వినియోగిస్తుంటారు. అటువంటి ప్రోడక్ట్లలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి వలన జుట్టుకి బ్రెయిన్ కి చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ప్యాక్ ని ట్రై చేసినట్లయితే తెల్ల జుట్టు నల్లగా మారడం తప్పనిసరి.
దీనిని ఒకసారి ట్రై చేసినట్లయితే దీని రిసల్ట్ చూసి మీరు అవాక్ అయిపోతారు. దానికోసం మొదటగా ఓ బౌల్ తీసుకొని ఒక గ్లాసు నీళ్లను దానిలో పోసుకొని రెండు చెంచాల టీ పౌడర్ ని వేసి ఆ నీటిని బాగా మరగనివ్వాలి. డికాషన్ మాదిరిగా అయిన తర్వాత దాంట్లో పది లవంగా మొగ్గలు వేసి మళ్లీ వేడి చేసుకోవాలి. ఐదు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆపి మళ్లీ ఒక చెంచా కాఫీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత రెండు బీట్రూట్లను తీసుకొని ముక్కలుగా కట్ చేసి నీళ్లు పోసుకోకుండా మిక్సి వేసి మెత్తని పేస్టులా పట్టుకోవాలి. ఈ పేస్ట్ నుండి జ్యూస్ తీసుకొని తర్వాత ఒక స్టవ్ పై ఒక ఇనుపకడాయిని పెట్టుకొని మనం మొదటగా చేసి పెట్టుకున్న డికాషన్ను దీనిలో కలుపుకోవాలి. తర్వాత దీంట్లో బీట్రూట్ జ్యూస్ కూడా వేసి బాగా కలుపుకొని తర్వాత కేశరంజిని పొడి మార్కెట్లో చాలా అరుదుగా లభిస్తూ ఉంటుంది.
అది అన్ని రకాల ఆయుర్వేద షాప్ లో దొరుకుతాయి. మనం మొదటగా చేసుకున్న డికాషన్ బీట్రూట్ జ్యూస్ లో ఈ పౌడర్ ని కలుపుకొని బాగా పలచగా అవ్వకుండా తిక్కుగా కాకుండా జుట్టుకి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా చేసుకొని దీనిని నైట్ అంతా మూత పెట్టి ఉంచుకోవాలి.
ఈ ప్రాసెస్ అంతా కూడా ఇనప కడాయిలోనే చేసుకోవాలి. తర్వాత మరునాడు దీని మూత తీసి మళ్లీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది అప్పుడు నల్లగా చేంజ్ అయి ఉంటుంది. ఈ పేస్ట్ ని తలస్నానం చేసిన తదుపరి జుట్టుని బాగా దువ్వుకొని ఈ పేస్ట్ ని కుదుళ్ళ నుంచి బాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత గంట నుంచి రెండు గంటల వరకు ఉంచుకోవాలి. తర్వాత ఎటువంటి షాంపూలు ఉపయోగించకుండా కేవలం నీళ్లతోనే దీన్ని కడిగేయాలి. ఈ విధంగా పదిహేను రోజులకి ఒకసారి అప్లై చేసుకోవడం వలన తెల్ల జుట్టు ఒకసారి కి నల్లగా అవుతుంది.