Health Benefits : రాత్రి భోజనం తర్వాత పది నిమిషాల వాకింగ్ తప్పనిసరి… లేదంటే వీటి బారిన పడక తప్పదు…
Health Benefits : రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోకుండా పది నిమిషాలు వాకింగ్ చేయడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చాలామంది రాత్రి భోజనం చేయగానే మొబైల్స్ ను చూస్తూ ఉంటారు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకని భోజనం చేశాక తప్పనిసరిగా ఒక పది నిమిషాలు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. రాత్రి సమయంలో భోజనం తర్వాత వాకింగ్ ఓ పది నిమిషాలు చేయడం వలన శరీరం చురుగ్గా ఉంటుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని భోజనం తర్వాత వాకింగ్ చేయడం అనే అలవాటును పాటించాలి.
రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వలన శరీరంలో గ్యాస్ట్రిక్ ఎంజైములు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. అలాగే ఉబ్బరం, మలబద్ధకం ఉదర సంబంధిత వ్యాధులను రాకుండా చేస్తాయి. తాజా అధ్యయనాల ప్రకారం భోజనం తర్వాత పది నిమిషాలు నడవడం వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం తర్వాత పది నిమిషాలు నడవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవచ్చు అని అంటున్నారు. వాస్తవానికి భోజనం తర్వాత అర్థగంటలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ప్రారంభం అవుతుంది. దీంతో బ్లడ్ షుగర్ పెరిగి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే వాకింగ్ అనేది చేయాలి.
శరీరం నడక ద్వారా ఇలా చేయడం వలన బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. భోజనం తర్వాత వాకింగ్ చేయడం వలన జీవక్రియ మెరుగుపడి తిన్న ఆహారం సులభంగా అరుగుతుంది. శరీరానికి ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడానికి నిద్ర సహాయపడుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వలన అధిక బరువు ఉన్నవారు సులువుగా బరువు తగ్గుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం నడక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలో ఎండార్ఫిన్ లను రిలీజ్ చేయడానికి సహాయపడుతుంది. ఇవి డిప్రెషన్, అలాగే నిద్రలేమి నుండి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే మానసిక ఆరోగ్యం కూడా ఉపయోగపడుతుంది కావున రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత వాకింగ్ అనేది తప్పనిసరిగా చేయాలి.