Aloe Vera : అందానికి అందం… ఆరోగ్యానికి ఆరోగ్యం… దీనితో ఎన్ని లాభాలో…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Aloe Vera : అందానికి అందం… ఆరోగ్యానికి ఆరోగ్యం… దీనితో ఎన్ని లాభాలో…!

Aloe Vera : అలోవెరా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ అలోవెరా లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉండటంతో ఈ మొక్కను ప్రతి ఒక్కరు తమ ఇంటిలో పెంచుకుంటున్నారు. అలోవెరా అనేది అందాన్ని రెట్టింపు చేయడంలో మరియు చర్మ సమస్యలను నివారించడంలో కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. అంతేకాక గాయాలను నియంత్రించడంలో కూడా ఈ అలోవెరా అనేది ఎంతో మేలు చేస్తుంది. కాలిన గాయాల దగ్గర ఈ అలోవెరా రాసుకున్నట్లయితే చర్మ కణాలు అనేవి […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 June 2024,11:30 am

ప్రధానాంశాలు:

  •  Aloe Vera : అందానికి అందం... ఆరోగ్యానికి ఆరోగ్యం... దీనితో ఎన్ని లాభాలో...!

Aloe Vera : అలోవెరా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ అలోవెరా లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉండటంతో ఈ మొక్కను ప్రతి ఒక్కరు తమ ఇంటిలో పెంచుకుంటున్నారు. అలోవెరా అనేది అందాన్ని రెట్టింపు చేయడంలో మరియు చర్మ సమస్యలను నివారించడంలో కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. అంతేకాక గాయాలను నియంత్రించడంలో కూడా ఈ అలోవెరా అనేది ఎంతో మేలు చేస్తుంది. కాలిన గాయాల దగ్గర ఈ అలోవెరా రాసుకున్నట్లయితే చర్మ కణాలు అనేవి ఆరోగ్యంగా మారతాయి. కొత్త కణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అలోవెరాలో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ అనేవి అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్ మాదిరిగా పనిచేస్తాయి. అలోవెరా రాయటంతో చర్మం పై ఉన్నటువంటి ముడతలను కూడా నియంత్రిస్తుంది. నిత్యం యవ్వనంగా కూడా ఉంచుతుంది…

కాలుష్యం మరియు మారిన ఆహారపు అలవాట్ల వలన చాలామంది మొటిమలతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ టైమ్ లో అలోవెరా రాయటం ఎంతో మంచిది. అలోవెరా రాయటంతో మొటిమలు అనేది తగ్గుతాయి. అలోవెరా రాయటంతో చర్మం కూడా ఎంతగానో మెరుస్తుంది. అలోవెరా యాంటీ ఇన్ఫ్లోమెంటరీ గుణాలను కలిగి ఉండటంతో చర్మంపై ఉన్నటువంటి ముడతలు మరియు మచ్చలను కూడా తొలగిస్తుంది. చర్మాన్ని ఎంతో తెల్లగా మార్చుతుంది. కలబంద రసాని కనక జుట్టుకు అప్లై చేసుకున్నట్లయితే ఒత్తైన నల్లని నిగారించే జుట్టును మీరు పొందుతారు. అలోవెరా జ్యూస్ నెత్తికి రాయటంతో రక్త ప్రసరణ అనేది కూడా ఎంతో మెరుగుపడుతుంది. అలోవెరా ఇలాంటి మైక్రోబయల్,యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి చుండ్రును కూడా దూరం చేయటం లో ఎంతో మేలు చేస్తుంది…

కలబందలో ఎన్నో గుణాలు ఉన్నాయి. అయితే కలబందను చాలా రకాలుగా కూడా వాడవచ్చు. ఇది మన చర్మానికి పోషణ ఇవ్వటమే కాక మన ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. దీనిలో విటమిన్లు, మినరల్స్ అమీనోయాసిడ్స్,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇది లోతైన గాయాలను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కలబంద రసం అనేది ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పదార్థాలు అధిక రక్తపోటు మరియు గుండెకు సంబంధించిన సమస్యలు నయం చేయటంలో కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. కలబందను కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు పట్టించుకోవాలి. దీనికోసం కొబ్బరి నూనెలో అలోవెరా జెల్ మిక్స్ చేసి హెయిర్ మాస్క్ లాగా అప్లై చెయ్యాలి.

Aloe Vera అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం దీనితో ఎన్ని లాభాలో

Aloe Vera : అందానికి అందం… ఆరోగ్యానికి ఆరోగ్యం… దీనితో ఎన్ని లాభాలో…!

కావాలి అంటే. ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేరు చేసుకుని కూడా జుట్టుకు పట్టించి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఈ ప్యాక్ ను ప్రతిరోజు వాడుతూ ఉన్నట్లయితే తొందరలోనే పోడువాటి మరియు మెరిసే జుట్టును మీరు పొందవచ్చు. దీనివలన వెంట్రుకల బలానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. అంతే తలలో ఉన్నటువంటి చుండ్రు, దురద లాంటివి కూడా అలోవేరా జల్ వాడవచ్చు. దీనిలో ఫ్యాటీ యాసిడ్ లు కూడా ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా వాపులను తగ్గిస్తుంది. జుట్టును బృదువుగా మెరుస్తూ ఆరోగ్యవంతంగా మెరిసేలా చేస్తుంది. జుట్టు నుండి అదనపు నూనెను కూడా తగ్గిస్తుంది. సరైన పోషకాహారాన్ని అందించటం వలన జుట్టు అనేది పెరుగుదలకు కూడా ఎంత సహాయం చేస్తుంది. దీంతో మన జుట్టు సిల్క్ గా మరియు మృదువుగా మెరిసేలా కూడా చేస్తుంది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది