Health Benefits : ఈ పండు అనేక వ్యాధులకి దివ్య ఔషధం…!!
Health Benefits : మనలో చాలామంది ఈ ప్రత్యేకమైన పండు పేరు విని ఉండరు.. మీరు మొదటిసారిగా ఈ పండును చూస్తే కనుక ఆశ్చర్యపోవచ్చు.. అయితే ఈ పండు ఎక్కడిదో కాదు.. ఇది మన భారత దేశంలోనూ దొరుకుతుంది.. ప్రత్యేకంగా భారతదేశంలోనూ ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది. భారత్ అలాగే చైనాలోని కొన్ని ప్రాంతాలలో ఈ పండు లభ్యమవుతుంది.. ఈ ప్రత్యేకమైన పండు ధ్యాన భంగిమలో ఉన్న బుద్ధ భగవానుడి చేతిని పోలి ఉంటుంది. అందుకే దీనిని బుద్ధుని చేతి ఫలం ఋషికం, ఫింగర్, సిట్రాన్ అనే పేర్లతో పిలుస్తారు.
ఇది సుగంధ భరితమైన పండు దీని చర్మం నిమ్మ, నారింజ ను పోలి ఉంటుంది. ఇది కూడా ఒక సిట్రస్ పండు అయితే ఇది పుల్లగా కాకుండా కొంచెం తీపిగా ఒక ప్రత్యేకమైన కలిగి ఉంటుంది. ఈ పండులోని పక్కన గుజ్జును రెండిటిని తినవచ్చు.. విత్తనాలు కూడా ఉంటాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. ఈ పండుతో సాధారణంగా జాములు, ఫర్ఫ్యూమ్ లు, సుగంధ నూనెలు తయారు చేస్తారు. ఈ ఫలం అనేక వ్యాధులకు దివ్య ఔషధంలా ఉపయోగపడుతుంది అని కొన్ని నివేదికలు వెల్లడించాయి.. ఈ పండుతో ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం..
నొప్పి నివారిణి : ఈ ఫలం ను కొన్ని రకాల నొప్పులకు ఉపయోగిస్తారు. ఈశాన్య భారతదేశంలో ఈ పండును శతాబ్దాలుగా నొప్పి నివారణగా ఉపయోగిస్తున్నారు. ఇవి నొప్పి నివారణకు బాగా పనిచేస్తాయి..
జీర్ణ సమస్యలు ఉండవు : కడుపునొప్పి, విరోచనాలు, తిమ్మిరి, ఉబ్బరం, మలబద్దకం లాంటి వివిధ జీర్ణ సమస్యలకు ఈ ఫలం శక్తివంతమైన నివారణగా పనిచేస్తుంది..
రోగనిరోధక శక్తికి : ఈ పలంలో ఒక విలక్షణమైన పాలి శాఖ రైడ్ ఉంటుంది. రోగనిరోధక శక్తిని మరింత పెంచుతుంది. ఈ పండు రికవరీ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.. ఈ పండు తింటే త్వరగా కోలుకోవచ్చు..
శ్వాసకోశ సమస్యలు దూరం : అనేక సిట్రస్ పండ్ల వలె బుద్ధ హ్యాండ్ కూడా అసాధారణమైన చికిత్స లక్షణాలు కలిగి ఉంది. ఇది శ్వాసకోశ వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అధిక దగ్గు, కఫం, జలుబు లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి..