Cauliflower : సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే… మీ ఆహారంలో కాలీఫ్లవర్ ను చేర్చుకోవాలి…!
ప్రధానాంశాలు:
Cauliflower : సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే... మీ ఆహారంలో కాలీఫ్లవర్ ను చేర్చుకోవాలి...!
Health benefits of cauliflower : కాలీఫ్లవర్ అనేది మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అయితే ఈ కాలీఫ్లవర్ లో విటమిన్ సి మరియు ప్రోటీన్, ఫైబర్, పొటాషియం మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే దీనిలో కెరోటినాయిడ్స్ మరియు ఫ్లేవనాయిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు లాంటి ముఖ్యమైన ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇన్ని పోషకాలు కలిగి ఉన్న కాలీఫ్లవర్ ను తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు బోలెడు. ముఖ్యంగా చెప్పాలంటే కాలీఫ్లవర్ అనేది గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. దీనిలో గ్లోకోరాఫేన్ అనేది గుండెకు సంబంధించిన సమస్యలను నయం చేస్తుంది. అలాగే గుండె సమస్యలతో బాధపడే వారు కూడా కాలీఫ్లవర్ ను తినొచ్చు. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలంగా చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటకు పంపించడానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే దీనిలో ఉన్న గ్లూకొరాఫెన్ ఉదర వ్యాధులను కూడా నయం చేస్తుంది…
ఈ కాలీఫ్లవర్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ లేవల్స్ ను మెయింటెన్ చేయటంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. అంతేకాక ఈ కాలీఫ్లవర్ లో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ కాలీఫ్లవర్ అనేది చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది…
అలాగే స్థూలకాయ సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలి అనుకుంటే కాలీఫ్లవర్ ను ఆహారంలో చేర్చుకోండి. అలాగే ప్రెగ్నెంట్ టైం లో క్లాలీఫ్లవర్ ను తినడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఉండే ఫోల్లెట్ అనేది పిండం అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. కావున గర్భిణీ స్త్రీలు తమ ఆహారంలో కాలీఫ్లవర్ ను కచ్చితంగా చేర్చుకోవాలి..