Coriander Leaves : ఆకులే కదా అని తీసిపారేయకండి… ఈ మూడు సమస్యల కు దివ్య ఔషధం…!!
Coriander Leaves : కొత్తిమీరను ప్రతి వంటలలో కచ్చితంగా వాడతారు. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే కొత్తిమీరను ప్రతి వంటలలో కచ్చితంగా వాడాలి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిజానికి ఈ కొత్తిమీర ప్రతి వంటలలో ముఖ్యమైన స్థానాన్ని సాధించింది. ఇది ఆహారం యొక్క రుచిని పెంచడమే కాకుండా ఇతర వైద్య సమస్యలకు చికిత్స చేయడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే పురాతన ఈజీషియన్ ల నుండి గ్రీకుల […]
ప్రధానాంశాలు:
Coriander Leaves : ఆకులే కదా అని తీసిపారేయకండి... ఈ మూడు సమస్యల కు దివ్య ఔషధం...!!
Coriander Leaves : కొత్తిమీరను ప్రతి వంటలలో కచ్చితంగా వాడతారు. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే కొత్తిమీరను ప్రతి వంటలలో కచ్చితంగా వాడాలి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిజానికి ఈ కొత్తిమీర ప్రతి వంటలలో ముఖ్యమైన స్థానాన్ని సాధించింది. ఇది ఆహారం యొక్క రుచిని పెంచడమే కాకుండా ఇతర వైద్య సమస్యలకు చికిత్స చేయడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే పురాతన ఈజీషియన్ ల నుండి గ్రీకుల వరకు కూడా దీనిని ఔషధంగా వాడారు. అలాగే దీనిని ఆయుర్వేద చికిత్సలో కూడా వాడతారు. ఈ కొత్తిమీర అనేది ఆహారానికి రుచిని మాత్రమే కాదు శరీరానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను ఇస్తుంది. అలాగే ఈ కొత్తిమీరలో విటమిన్ ఏ సి బి కే,ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం లాంటి ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు అనేవి మన శరీరానికి రోగనిరోధక శక్తిని బలంగా చేస్తాయి. అలాగే వీటితో పాటుగా ఎన్నో సమస్యలతో కూడ పోరాడుతుంది. అంతేకాక మూత్ర సమస్యలను దూరం చేయటంతో పాటుగా కిడ్నీలను శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది…
కొత్తిమీర ఆకులు మరియు ధనియాలు అనేవి విటమిన్ కె ను కలిగి ఉంటాయి. అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అంతేకాక బోలు ఎముకల వ్యాధి నుండి కూడా రక్షిస్తుంది. అంతేకాక గుండె జబ్బులు మరియు డిప్రెషన్, మలబద్ధకం, మధుమేహం, అజీర్ణం లాంటి అంటువ్యాధులు,ప్రకోప ప్రేగు సిండ్రోమ్,చర్మ సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలతో పోరాడేందుకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అయితే ఆజీర్ణ సమస్యలతో మరియు ప్రేగు సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడేవారు కొత్తిమీర పచ్చడి ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిని తింటే కడుపు కూడా నిండుతుంది. అంతేకాక ఇది పేగు కు సంబంధించిన వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది.
మీరు ప్రతిరోజు ఆహారంలో కొత్తిమీరను తీసుకోవడం వలన శరీరంలో ఎక్కువ సోడియం ను మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఇక శరీరాన్ని లోపల నుండి కూడా ఎంతో ఫీట్ గా ఉండేలా చూస్తుంది. అలాగే ఈ కొత్తిమీర అనేది చెడు కొలెస్ట్రాల్ మరియు రక్త పోటును కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే ఈ కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటంలో హెల్ప్ చేసే ఎంజైమ్ లను కూడా కలిగి ఉంటుంది. అంతేకాక ఇది మధుమేహాని తగ్గించడంలో మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటం లో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ పచ్చి కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్ అనేవి సమృద్ధి గా ఉంటాయి. అయితే ఇవి ఫ్రీ రాడికల్స్ వలన సెల్యులార్ డామేజ్ ను కూడా నియంత్రిస్తుంది..