Health Benefits : ఉదయాన్నే లేవగానే నీరసంగా ఉండేవాళ్ళు… ఒక స్పూన్ ఇది త్రాగాలి…
Health Benefits : మనలో చాలామంది నిద్ర లేవగానే నీరసంగా ఉంటారు. కొంచెం డల్ గా నీరసంగా ఉంటారు. దీనినే మార్నింగ్ సీక్నెస్ అంటారు. ఈ సమస్య ఉన్న వారిలో పొట్ట అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా అందరికీ నోట్లోంచి పసర్లు లేదా పుల్లగా వస్తూ ఉంటాయి. ఉదయం లేవగానే నోటిలో అదోరకంగా ఉండడం వలన నీరసంగా ఉంటారు. ఇటువంటి మార్నింగ్ సీక్ ను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఉదయం తీసుకోవడానికి బదులుగా ముందు రోజు సాయంత్రం తీసుకుంటే ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. దీనికోసం కొద్దిగా సొంటిని తీసుకోవాలి. అల్లం ముక్కను పాలలో నానబెట్టి బాగా ఎండబెట్టగా వచ్చిన దానిని సొంటి అంటారు. ఈ సొంటి మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంది.
ఈ సొంటి కొమ్ములను తెచ్చుకొని ఎండలో ఎండబెట్టి మెత్తగా పొడి లాగా చేసుకోవాలి. తర్వాత జల్లెడ పట్టుకొని వచ్చిన పొడిని నిలువ చేసుకోవాలి. ఇలా వచ్చిన సొంటి పొడి చిటికెడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా సొంటి తేనె కలిపిన మిశ్రమాన్ని రాత్రి భోజనానికి ముందు నాకేసి ఆ తర్వాత భోజనం చేయాలి. సాయంత్రం సమయంలో తీసుకోవడం వలన ఉదయం నీరసం రాకుండా ఉంటుంది. ఈ సొంటి పొడిలో జీర్ణరసాలను బాగా ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. ఇది ఆకలిని ఎక్కువగా చేస్తాయి. మనం తిన్న ఆహారం పులియకుండా నిల్వ ఉంచకుండ చేస్తాయి.
అంతేకాకుండా జీర్ణ రసాలను బాగా రెగ్యులేట్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అందువలన జీర్ణశక్తి పెరుగుతుంది. దీంతో పసర్లు నిల్వ ఉండడం పులియడం ఇవన్నీ మార్నింగ్ సీక్నేస్ కు కారణం కావడం వలన తలనొప్పి వాంతులు వంటివి రాకుండా సొంటి చేస్తుంది. సొంటి తేనె కలిపిన మిశ్రమాన్ని సాయంత్రం సమయంలో తీసుకోవాలి ఆ తర్వాతే భోజనం చేయాలి ఇది ఉదయానికి బాగా పనిచేస్తుంది దీనివల్ల ఉదయం పూట ఫ్రీగా ఉంటుంది ఉదయం లేవగానే నీరసం తగ్గుతుంది. అలాగే మరొక చిట్కా ఏంటంటే ఉదయం లేవగానే నోరు పుక్కిలించుకొని గోరువెచ్చగా కాచుకున్న నీళ్లను త్రాగాలి ఇలా వేడి నీళ్లు తాగేసరికి పొట్ట ఇరిటేషన్ మొత్తం పోతుంది. దీంతో బాడీ యాక్టివ్ గా ఉంటుంది.