Health Benefits : పచ్చి మిర్చి తినే వారు ఇది తెలుసుకోండి.. ఇంకా ఇంకా కావాలంటారు!
Health Benefits : పచ్చి మిర్చి ఇంట్లో ఎప్పుడూ వాడేదే. కూరల్లో తరచూ వాడేవే. అయితే మిర్చి చేసే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. కేవలం కూరలో కారం కోసం, రుచి కోసం మాత్రమే పచ్చి మిర్చిని వాడటం అందరికీ తెలుసు. వీటి గురించి కూడా తెలుసుకుంటే పచ్చి మిర్చిని అస్సలే వదిలిపెట్టరు.పచ్చి మిర్చి అనగానే దాని ఘాటు రుచి గుర్తుకువస్తుంది. పచ్చి, పండు, ఎండిన మిరపకాయ, మళ్ళీ అందులో కూడా కాశ్మీరు, గుంటూరు రక రకాలు వైవిధ్యాలు. పచ్చి మిర్చి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి మిర్చికి ఆరోగ్యానికి సంబంధం ఏమిటీ అంటే కారం తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అని తెలుసుకుందాం. మిర్చిలో ఇంత కారం, ఘాటు ఉండటానికి ముఖ్య కారణం క్యాప్-సైసిన్ అనే గుణం. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
దీని వల్ల మనం తిన్న ఆహారంలోని ఐరన్ కంటెంట్ రక్తంలో కలవడానికి సాయపడుతుంది. నడుము చుట్టూ ఉన్నా అనవసరపు కొవ్వుని తగ్గించటంలో పచ్చి మిర్చి ఎంతో ఉపయోగపడుతుంది.పురుషుల్లో కనిపించే ప్రాస్టెట్ క్యాన్సర్ లాంటి సమస్యలను దూరం ఉంచుతుంది. కారం తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ జరిగి టాక్సిన్స్ లాంటి విష పదార్థాలను యూరినేషన్ లో నుంచి బయట వేస్తుంది. పచ్చి మిర్చి వాడటం వల్ల మన బ్రెయిన్ లో ఉన్న హైపోథాలమస్ అనే కేంద్రాన్ని ప్రేరేపించడం వల్ల శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. జీర్ణ క్రియను బలపరుస్తుంది ఆకలి పెంచుతుంది. విటమిన్ సి కలిగి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.

Health benefits of green chilli
అలాగే పచ్చి మిరపలో విటమిన్-బి6 – మెటబాలిజం పెంచటంలో సహాయ పడుతుంది. విటమిన్ K1- రక్తపోటును తగ్గిస్తుంది. ఎముకలకు బలం ఇస్తుంది. కిడ్నీ సమస్యలు రానట్టు ప్రొటెక్ట్ చేస్తుంది. పోటషియం- హృదయ సంబంధి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. విటమిన్-ఎ – బిటా కేరాటిన్ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మరియు కొన్ని రకాల పోషకలను విటమిన్ ఎ రూపంలోకి మార్చుతుంది. పచ్చి మిర్చి విత్తనాల్లో ఫైటోస్టరాల్స్ అనే పదార్థం ఉంది. ఇది రక్తనాళ్ళలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది.. శరీరంలో నుంచి ఫ్రీ రాడికల్స్-ను ఎప్పటికప్పుడు బయట వేస్తుంది. కాబట్టి క్యాన్సర్ సెల్స్ పెరగనట్టు చేస్తుంది. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రణల్లో ఉంచుతుంది. పచ్చి మిర్చీలు జిరో ఫ్యాట్ మరియు ఎన్నో పోషకాలతో కూడింది కాబట్టి ఇందులో చెప్పిన సలహాలు మీకు సహాయ పడుతుంది. ఇది పచ్చి మిర్చి వ్యాసం మంచి చెడూ తెలిసింది కదా.
