Health Benefits : రాత్రుళ్లు నిద్ర పట్టని వారు… ఒక గ్లాస్ ఇది త్రాగండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : రాత్రుళ్లు నిద్ర పట్టని వారు… ఒక గ్లాస్ ఇది త్రాగండి…

 Authored By aruna | The Telugu News | Updated on :13 September 2022,6:30 am

Health Benefits : టొమాటోలు ఆరోగ్యానికి చాలా మంచివి. టొమాటోలో 93 గ్రాములు నీటి శాతమే ఉంటుంది. అలాగే 2.5 గ్రాములు కార్బోహైడ్రేట్స్, రెండు గ్రాములు ప్రోటీన్స్ ఉంటాయి. 100 గ్రాములు టమాటాలు తీసుకుంటే అందులో నుంచి 23 గ్రాముల శక్తి మనకు లభిస్తుంది. టమాటాలో ముఖ్యంగా లైకో పెన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది ఎక్కువగా తొక్కలో ఉంటుంది. ఈ లైకో పెన్ అనే కెమికల్ మన చర్మం లో ఉన్న కొల్లాజిన్ ను దెబ్బ తినకుండా కాపాడుతాయి. కొల్లాజీన్ లేకపోతే చర్మం ముడతలు వస్తాయి. టమాటాలో ఉండే లైకో పెన్ కంటిలో ఉన్న రెటీనాను కాపాడుతుంది. లైకో పెన్ ఎముకల్లో ఉన్న క్యాల్షియం బయటకి రాకుండా చేస్తుంది.

ఎముకలు గట్టి పడటానికి లైకోపెన్ బాగా ఉపయోగపడుతుంది. టమాటాలో ఉండే ట్రిప్టోపెండ్ అనే కెమికల్ నిద్రపుచ్చడానికి సంబంధించిన మెలటోనిన్ హార్మోని విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే నిద్రపుచ్చే హార్మోన్ బాగా విడుదల అవ్వాలి అంటే ఎక్కువగా టమాటాలు తినే ఆహారంలో తీసుకోవాలి. టమాటాల్లో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ రక్తనాళాలను మృదువుగా ఉండేటట్లు చేస్తుంది. దీనివలన బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. స్త్రీలకు ముఖ్యంగా బ్రిస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి టమాటలలో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. చాలామందికి ఎండ పడదు.

Health Benefits of these drink in Telugu

Health Benefits of these drink in Telugu

ఇలాంటివారు టమాటాను రోజుకి 40 గ్రాములు పేస్టులాగా చేసుకొని షూస్ చేసుకొని సుమారుగా 12 వారాలు తాగితే సన్బౌన్స్ రాకుండా ఉంటుంది. ముఖ్యంగా టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ని ఎక్కువగా కలిగి ఉంటుంది ఇవన్నీ కలిసి చర్మం లో ఇన్ఫిమేషన్ ని తగ్గించడానికి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా ఉపయోగపడేవి టమాటాల్లో ఉంటాయి. టమాటాలను ఉడకబెట్టిన దానికన్నా పచ్చివి తింటే ఆరోగ్యంగా ఉంటారు. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు టమాటాలను తినకూడదు. ఎందుకంటే దీనిలో ఆక్సలైట్స్ ఉంటాయి. అందుకే వీటిని వండి తినడం మంచిది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది