Health Benifits : మీ ఆయుషు ని భారీగా పెంచుకోవాలంటే మీ ఇంట్లో ఈ మొక్క ఉండాలి…
Health Benifits : మనం పూల కోసం ఇంటి అందం కోసం ఎన్నో రకాల మొక్కలను పెంచుతూ ఉంటాం. అయితే మనం అందం కోసం పెంచుకునే మొక్కలలో మన ఆయుష్ పెంచే మొక్క కూడా ఒకటి ఉన్నది అదే వాము అకు మొక్క Ajwain plant . ఈ మొక్క చాలామందికి తెలిసి ఉంటుంది. దీనితో పచ్చడి చేస్తూ ఉంటారు. అలాగే బజ్జీలు కూడా వేస్తూ ఉంటారు. ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మొక్కల్ని నర్సరీలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. దీని ఆకులు చాలా మందంగా ఉంటాయి. ఈ మొక్కకు నీరు ఎక్కువ అవసరం ఉండదు. మొక్కలోని ఓ కాడను తెంపి భూమిలో పెడితే అది పెద్ద మొక్కగా విస్తరిస్తుంది.ఇది సువాసనలు ఎదజల్లే గొప్ప మొక్క. ఇది ఇంటి గుమ్మం దగ్గర లేదా ఇంట్లోకి గాలి వచ్చే చోట పెడితే ఈ మొక్క నుంచి వచ్చే గాలి పరిమళాలతో వస్తుంది. దానిని పీల్చడం వలన ఆరోగ్యానికి ఎంతో ఫలితం ఉంటుంది.
ఈ వాము ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గర్భిణీలకు, పాలిచ్చే బాలింతలకు మాత్రం వీటిని వాడకూడదు. ముఖ్యంగా గర్భిణీలు వీటిని వాడితే గర్భస్రావం అవుతుంది. లేదా పుట్టే బిడ్డకు నష్టం కలుగుతుంది.వామకులలో ఉండే ఔషధ గుణాలు రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. గుండెలోని రక్తనాళాల్లోకి కాల్షియం వెళ్లకుండా చేయడం వలన బిపిని కంట్రోల్ చేస్తాయి.కరివేపాకు, కొత్తిమీరను వాడినట్లు వామాకులను కూడా కూరల్లో వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అజీర్తి, ఉబ్బరం, పొట్ట గ్యాస్ లాంటి సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం కూడా తగ్గుతుంది. అలాగే ప్రేగుల్లో నొప్పి అల్సర్లు లాంటివి తగ్గుతాయి.వామాకులలో క్యాలరీలు తక్కువ ప్రోటీన్ ఫ్యాట్ కార్బోహైడ్రేటు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని ఫలితంగా శరీరంలోని కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.
ఈ ఆకులు బరువు పెరగకుండా చేస్తే దానివల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎక్కువ కాలం జీవించడానికి ఈ ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి.ఈ వామకులు మంచి సువాసన వస్తుంటాయి. వాటితో చట్నీలు, జ్యూస్, బజ్జీలు, పకోడీలు కూరలులోకూడా వాడుకోవచ్చు.. ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు కూడా కలుగుతాయి. ప్రధానంగా ఆయుష్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. ఈ వామకుల్ని నిత్యం వాడే వారికి దగ్గు, జలుబులు అస్సలు రావు. ఒకవేళ వస్తే పది వాము ఆకుల్ని కడిగి వేడి నీటిలో వేసి మరిగించుకోవాలి. ఈ నీరు మూడోవంతు వరకు తగ్గాక వడకట్టి తీసుకోవాలి. కావాలంటే ఓ స్పూన్ తేనె కూడా కలుపుకొని తీసుకోవచ్చు..