Health Care : ఖాళీ కడుపుతో అరటి, జామ, టమాట వీటిని తీసుకుంటే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్టే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Care : ఖాళీ కడుపుతో అరటి, జామ, టమాట వీటిని తీసుకుంటే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్టే…!

 Authored By prabhas | The Telugu News | Updated on :2 December 2022,6:00 am

Health Care : చాలామంది ఖాళీ కడుపుతో కొన్ని ఫ్రూట్స్ ను తింటూ ఉంటారు. ఇంకొందరు కొన్ని రకాల ఫ్రూట్స్ ను బ్రేక్ ఫాస్ట్ లాగా చేస్తూ ఉంటారు. అయితే ఉదయం తీసుకునే ఆహారం పౌష్టిక ఆహారం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం అయితే ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తీసుకోవచ్చు. కానీ ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలని అసలు ముట్ట వద్దని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
బాగా ఆకలిగా ఉన్నప్పుడు వీటిలో కొన్నిటిని తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం కలుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…

పెరుగు : దీనిలో ప్రోటీన్లు, విటమిన్లు మరియు మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇంట్లో తయారుచేసిన లేదా దుకాణంలో తెచ్చుకున్న పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. అయితే ఖాళీ కడుపుతో దీనిని తీసుకోకూడదు. దీనిలో ఉండే బ్యాక్టీరియా కడుపులోని యాసిడ్లకు ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. కావున ఖాళీ కడుపుతో దీనిని అసలు తీసుకోకూడదు. ఉదయం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్న తర్వాత కొంత సమయం తర్వాత పెరుగు తీసుకోవచ్చు…

Health Care Tips in be careful you should never eat these food items

Health Care Tips in be careful you should never eat these food items

జామ పండు : వేసవిలో ఖాళీ కడుపుతో జామ పండు తీసుకుంటే మేలు జరుగుతుంది. కానీ చలికాలంలో ఇలా చేయడం వలన కడుపునొప్పికి ఆహ్వానం పలికినట్లే జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. అలాగే కడుపునొప్పి కూడా వస్తుంది.

టమాట : దీనిలో ఉండే లైకోపీన్ ఆరోగ్యానికి మంచిది. అయితే టమోటాలు ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది కాదు. దీనిలో ఉండే టానిక్ యాసిడ్ గ్యాస్టిక్ యాసిడ్తో చర్య జరుగుతుంది. దాని మూలంగా కడుపులో చికాకు గా ఉంటుంది. మధ్యాహ్నం భోజనంలో టమోటాలు చేర్చుకోవడం మేలు. దీనిని సలాడ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు…

పచ్చి కూరగాయలు : వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే ఖాళీ కడుపుతో కూరగాయలు తినడం వల్ల ఉబ్బరం, అజీర్ణం లాంటివి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే కాళీ కడుపుతో అస్సలు తీసుకోవద్దు. సరిఅయిన సమయంలో సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.

అరటిపండు : చాలామంది ఆకలి తీర్చుకోవడానికి అరటిపండు తింటూ ఉంటారు. ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అయితే దీనిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రక్తంలో మెగ్నీషియం, పొటాషియం లెవెల్స్ ను ఆసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి ఖాళీ కడుపుతో అరటిపండు తీసుకోవద్దు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది