Health Problems : మూత్రం నుంచి దుర్వాసన రావడానికి కారణం ఇదే… అశ్రద్ధ వహించకండి…
Health Problems : ప్రస్తుత కాలంలో జీవన శైలిలో వచ్చిన మార్పుల వలన శరీరం అనేక రకాలుగా ప్రతిస్పందిస్తుంది. వీటిలో మూత్రం నుంచి దుర్వాసన రావడం కూడా ఒక కారణం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే రాత్రి సరిగ్గా నిద్రపోనప్పుడు టీ, కాఫీ లేదా సోడా ఎక్కువగా తీసుకున్నప్పుడు వస్తుంది. దీనివలన యూరిన్ దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని కారణాలతో కూడా మూత్రం నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుంది. అలాంటప్పుడు వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మన బాడీ డిహైడ్రేషన్ కి గురైనప్పుడు మూత్రం రంగు మందపాటి పసుపు రంగులోకి మారుతుంది.
దీని తర్వాత మూత్రంలో మంట సమస్య వస్తుంది. అప్పుడు కూడా శ్రద్ధ చూపకపోతే మూత్రం మళ్ళీ మళ్ళీ వచ్చినట్లు ఒత్తిడి పెరుగుతుంది. కానీ మూత్రం రాదు. చుక్కలు చుక్కలు మాత్రమే వస్తాయి. ఇలాంటి సందర్భంలో మూత్రం నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. దీనివలన శరీరంలోని అంతర్గత అవయవాలలో ఇన్ఫెక్షన్ పెరగవచ్చు. పచ్చి ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, మొలకలు, ఇంగువ క్రమం తప్పకుండా లేదా పెద్ద పరిమాణంలో తినే వ్యక్తుల్లో మూత్రం దుర్వాసన కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది మూత్రంలో సల్ఫర్ పరిమాణం పెరగటం వల్ల జరుగుతుంది. అలాగే మద్యం సేవించే వారిలో మూత్రం చెడు వాసనతో ఉంటుంది. అలాంటప్పుడు ధూమపానం చేసేవారిలో కూడా ఉంటుంది.
కోక్,సోడావంటి పానీయాలను ఎక్కువగా లేదా ప్రతిరోజు త్రాగేవారికి యూరిన్ చెడు వాసన వచ్చే సమస్య ఉంటుంది. అలాంటప్పుడు ఇది మూత్రం వ్యాధి లక్షణం కాదు. ఈ కారణాలన్నీ శరీరాన్ని లోపల నుంచి బలహీనంగా చేస్తాయి. అందువల్ల అలవాటులను మానుకోవాలి. సాధారణంగా స్త్రీలకు కొన్ని కారణాల వలన యూరిన్ వాసన వచ్చే సమస్య ఉంటుంది. యూటీఐ సంక్రమణ, తక్కువ నీరు త్రాగడం, గర్భధారణ సమయంలో, ఔషధాల వినియోగం, మద్యపానం, ధూమపానం ప్రెగ్నెన్సీ కాకుండా ఈ సమస్యలో ఏదైనా ఒకటి ఎక్కువ కాలం కొనసాగితే మహిళలు దాన్ని తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువలన చెడు అలవాటులను నియంత్రించాలి. యుటిఐ సమస్య ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు లేదా ఏదైనా వ్యాధికి నిత్యం మందులు వాడుతున్న వారి మూత్రం కూడా చెడువాసన వస్తుంది. అలాంటప్పుడు ఆందోళన చెందకుండా వైద్యుడుని సంప్రదించి సరైన కారణాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి.