Health Problems : చికెన్ ఎక్కువగా తింటున్నారా… అయితే ఈ సమస్యల బారిన పడినట్లే…
Health Problems : ప్రస్తుతం చికెన్ ప్రియులు ఎక్కువైపోయారు. ఆహార పదార్థాలలో ముఖ్యంగా నాన్ వెజ్ లో చికెన్ ముందు వరుసలో ఉంటుంది. చికెన్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. చికెన్ తో చేసిన ఏ పదార్థం అయినా ఇష్టంగా తినేస్తారు. ఇంట్లో చేసుకునే వంటకాల నుంచి బయట హోటల్, రెస్టారెంట్ల వరకు చికెన్ దే మొదటి స్థానం. చికెన్ లో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, గోంగూర చికెన్, చికెన్ బిర్యాని, గ్రిల్ చికెన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వెరైటీలు ఉన్నాయి. అయితే చికెన్ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు అంటున్నారు.
చికెన్ తినడం వలన ఆరోగ్యానికి ఉపయోగమే అయినప్పటికీ ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. చికెన్ లో ఉండే ప్రోటీన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కండరాల పెరుగుదలకు చికెన్ మంచి ఆహారం అని చెప్పవచ్చు. అయితే చికెన్ ఎక్కువగా తింటే ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుందని వైద్యులు అంటున్నారు. ప్రతిరోజు చికెన్ తినడం వలన చికెన్ కొనేటప్పుడు, వండేటప్పుడు జాగ్రత్త అవసరమని వివరిస్తున్నారు. చికెన్ లో ఉండే సాల్మొనెల్ల బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్ కు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
తాజా అధ్యయనం ప్రకారం చికెన్ ఎక్కువగా తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతాయని పేర్కోంది. దీని కారణంగా గుండె సమస్యలు, హైపర్ టెన్షన్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే ప్రతిరోజు చికెన్ తినడం వలన బరువు పెరిగే అవకాశం ఉందని డైట్ మెయింటైన్ చేసేవారు చికెన్ తక్కువగా తీసుకోవడం మంచిదని తెలిపారు. డైరీ ప్రొడక్ట్స్, రెడ్ మీట్, చికెన్ స్కిన్ లో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తక్కువగా, పరిమితికి మించే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.