Health Problems : సెలవులలో రోజంతా నిద్రిస్తున్నారా… అయితే మీకు ప్రమాదం తప్పదు…!
Health Problems ; ఉద్యోగం చేసే వాళ్ళు సెలవు దొరికితే చాలు రోజంతా నిద్రపోతూనే ఉంటారు. ఆ సమయాలలో ఎక్కువగా నిద్రించడం అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు. మనిషి శరీరానికి సరిపడినంత నిద్ర చాలా ముఖ్యం.. ఇప్పుడున్న జనరేషన్లో ఉరుకుల బెరుకుల సమయంలో వారం అంత తీరిక దొరకని షెడ్యూల్సు నిద్ర కూడా కరువవుతూ ఉంటుంది. ఇక సెలవులు దొరికాయి అంటే చాలు ప్రశాంతంగా పడుకుంటారు. అయితే మీ ఆరోగ్యం ఇక డేంజర్ లో పడినట్లే అని నిపుణులు తెలియజేస్తున్నారు. వారాంతంలో అధికంగా నిద్రపోయేవాళ్లు శరీరంలో సమతుల్యత దెబ్బతినటంతో పాటు స్వల్పకాలిక నిద్ర దీర్ఘకాలిక రోగాలు వస్తాయని చెప్తున్నారు. నిద్ర తగ్గితే ఏం జరుగుతుంది : ఒకవేళ మనిషికి నిద్ర తగ్గితే ఏం జరుగుతుందనే దానిపై యూనివర్సిటీ ఆఫ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారు కొంతమంది వాలంటీర్లు
పరిశోధన చేసి కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోనిచ్చారు. ఇలా ఐదు రోజులు చేశారు. మిగిలిన రెండు రోజులు రోజుకు 10:00 చొప్పున నిద్ర అవకాశం ఇచ్చారు. ఈ విధంగా చేయడం వలన వారి శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. వారిలో కొన్ని దీర్ఘకాలిక మార్పులు చోటు చేసుకున్నట్లు బయటపెట్టారు.. వీకెండ్ లో స్లీప్ తో ఇబ్బందులు : నిద్రలేమి వారాతంలో అధిక నిద్రలాంటి వాటిపై కులారాడో యూనివర్సిటీ ప్రెస్ వారు చేసిన మరో ఆధ్యాయంలో మరిన్ని వాస్తవాలు తెలిసాయని వారు వెల్లడించారు. ప్రధానంగా ఇన్సులిన్ సెన్సిటివిటీకి దెబ్బ తింటున్నట్లు తెలిపారు. అలాగే బరువు పెరగడానికి కూడా దోహతపడుతున్నట్లు చెప్పారు. దీర్ఘకాలిక సమస్యలు : ఇక తక్కువ నిద్రపోతున్నప్పుడు దీర్ఘకాలంలో మధుమేహం, బీపీ థైరాయిడ్ సమస్యలు అధిక బరువు లాంటివి వస్తున్నాయి.
రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలి : సహజంగా రోజులు ఒక వ్యక్తికి కనీసం 6 నుంచి 7 గంటల వరకు నిద్ర చాలా ముఖ్యం. ఈ సమయంలోనే మనిషి శరీరం పునరుద్తేజం అవుతుంది. అన్ని అవయవాలు లోపల వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి ఈ నిద్ర సహాయపడుతుంది. అప్పుడు శరీరానికి కావలసిన వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బ్రెయిన్ నరాలు సక్రమంగా పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇన్సులిన్ ఫంక్షన్ క్రమంగా జరుగుతుంటుంది. సరిపడిన బాడీ వెయిట్ కూడా మెయింటెన్ అవుతూ ఉంటుంది. స్వల్పకాలిక సమస్యలు నిద్రలేమి కారణంగా వ్యక్తి ఫోకస్ తగ్గిపోవడం నీరసం చిన్న విషయాలకే టెంపర్ కోల్పోవడం అతి కోపం వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం వ్యక్తి శక్తిహీనత ఇలాంటి వ్యాధులన్నీ చుట్టుముడుతూ ఉంటాయి.