Health Tips : రాత్రి సమయంలో వీటిని తింటున్నారా..? అయితే మీరు బండలా అవ్వడం ఖాయం…!!
Health Tips : అందరూ చాలా స్లిమ్ గా అందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే కొందరు వాళ్లు తీసుకునే ఆహార పదార్థాలు వలన బరువు పెరిగిపోతూ ఉంటారు. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి పెద్ద సవాల్.. మన శరీరంలో కొలెస్ట్రాలు అధికమైతే అది మన ప్రాణం డేంజర్ లో పడినట్లే. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. దానివలన ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇక కొన్ని రకాల ఆహారాలు మన శరీరంలో కొలెస్ట్రాల్ ను పెరగడానికి కారణం అవుతుంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో వీటిని తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ స్పీడ్ గా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకనగా రాత్రి తిన్న తర్వాత నిద్ర పోతాం. శారిక శ్రమ అనేది ఉండదు.
దాని ఫలితంగా తిన్న ఆహారం కొలెస్ట్రాల్ గా మారి మరింత బరువు పెరగడానికి కారణమవుతూ ఉంటుంది. మరి రాత్రి సమయంలో తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణమయ్యే పదార్థాలు ఏంటో అసలు వేటిని మనం తీసుకోకూడదు వాటిని ఇప్పుడు మనం చూద్దాం… స్వీట్లు : రాత్రి సమయంలో స్వీట్లు తీసుకోవద్దు స్వీట్లు తీసుకోవడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికమవుతుంటాయి. కాబట్టి రాత్రి సమయంలో స్వీట్లు తో పాటు టీ, కాఫీలు, కేకులు, స్వీట్లు శీతల పానీయాలు అసలు ముట్టవద్దు.. స్పైసీ, ఆయిల్ ఫుడ్ : రాత్రి సమయంలో ఆయిల్ ఫుడ్స్ స్పైసీ లు అధికంగా తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ అధికమవుతూ ఉంటుంది. నూనెలో కొవ్వులు అధికంగా ఉంటాయి.
ఇది త్వరగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి. కాబట్టి కొవ్వు ధమనులలో పెరిగిపోతుంది. ఇది రక్త ప్రసరణను చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. చీజ్ : ప్రస్తుత కాలంలో చాలామంది చీజ్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. చీజ్ లేకుండా బర్గర్, పాస్తా, పిజ్జా వంటి ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడడం లేదు. చీజ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కానీ దీనిని అధికంగా తెలుసుకోవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనిలో గుండెకు హాని కలిగించే కొవ్వు ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి చీజ్ ని అధికంగా తినవద్దు.. ఫాస్ట్ ఫుడ్ : ఫాస్ట్ ఫుడ్ గుండెకు చాలా ప్రమాదకరం ఇది కొలెస్ట్రాల్ ని స్పీడ్ గా పెంచుతుంది. ప్రధానంగా రాత్రి సమయంలో ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం మానుకోవాలి. అసలు తీసుకోవద్దు. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం..