Diabetes : డయాబెటిస్ ఉన్న వారు చేపలు, పెరుగు తినొచ్చా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : డయాబెటిస్ ఉన్న వారు చేపలు, పెరుగు తినొచ్చా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :17 December 2021,8:20 pm

Diabetes : డయాబెటిస్ అనే వ్యాధి వచ్చినట్లయితే చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీరు తము తీసుకునే ఆహారం, జీవనశైలిపైన శ్రద్ధ వహించకుంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు వచ్చే చాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటికి ఫుడ్‌కు దూరంగా ఉండాలి అనే విషయాలపై స్పెషల్ స్టోరి..మధుమేహం ఉన్న వారి బ్లడ్‌లో షుగుర లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఇకపోతే ఈ డయాబెటిస్‌లోనూ రకాలుంటాయి. టైప్1, టైప్ 2 అని.. టైప్ 1 డయాబెటిస్‌ను చిన్నతనంలోనే గుర్తిస్తారు. అయితే, టైప్ 2 డయాబెటిస్ మాత్రం అసహజ జీవనశైలి వలన వస్తుంటుంది.

దీనికి వంశపారంపర్యం కూడా ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటిస్ వారకి పదే పదే దాహం అవుతుంటుంది. దాహార్తి ఎక్కువగా ఉండటంతో పాటు అలసట, చూపు మందగించడం, గాయలు మానకపోవడం వంటి లక్షణాలుంటాయి. ఈ లక్షణాలున్న వారు కంపల్సరీగా డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ప్రతీ రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఫుడ్ కూడా డైట్ పాటిస్తుండాలి. షుగర్ లెవల్స్ ఇంక్రీజ్ చేసే ఫుడ్, కార్బోహైడ్రేట్స్ అత్యధికంగా ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి. ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్ తీసుకోకూడదు.సోడాలు కూడా తాగొద్దు. ప్యాక్ డ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు. కూరగాయలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. శారీరక శ్రమ కంపల్సరీ.

 health tips for diabetese patients

health tips for diabetese patients

Diabetes : ఫుడ్ హ్యాబిట్స్‌పైన ఫోకస్ మస్ట్..

శారీరక శ్రమ చేయనట్లయితే ఇబ్బందులు ఇంకా ఎక్కువవుతాయి. గుండె, ఊపిరితిత్తులకు ప్రయోజనం కలిగే విధంగా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే డయాబెటిస్ ఉన్న వారు కంపల్సరీగా ఆకుకూరలు తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. పప్పులు, తృణధాన్యాలు, గుడ్డు, పెరుగు, చేపలను తమ ఆహారంలో చేసుకోవడం మంచిదే. పప్పుల్లో ఉండేటువంటి ప్రోటీన్స్, ఫైబర్, ఇతర పోషకాలు హెల్త్‌కు చాలా మంచివి. ఇక ప్రతీ రోజు కోడి గుడ్డు ఒకటి తింటే చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి. గుడ్డులో ఉండే అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ హెల్త్‌కు చాలా మంచి చేస్తాయి. కర్డ్.. కూడా హెల్త్‌కు చాలా మంచిది. పెరుగు వెయిట్ లాస్ చేయడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది